బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త చీఫ్‌గా అవినాష్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం మెగా చీఫ్‌గా ఉన్న విష్ణుప్రియ నుంచి మెగా చీఫ్ బ్యాండ్‌ను అవినాష్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ఈరోజు రాత్రి ప్రసారం కానుంది. అయితే నిఖిల్, నబీల్ లాంటి స్ట్రాంగ్ కంటెంస్టెంట్లు ఉన్నప్పటికీ వాళ్లని ఎదుర్కొని గెలిచి అవినాష్ సత్తా చాటాడు.
హౌస్‌ను నాలుగు టీమ్‌లుగా విభజించిన బిగ్‌బాస్.. వారిలో ఎక్కువ టాస్కులు గెలిచిన టీమ్‌కి చీఫ్ కంటెండర్లు అయ్యే ఛాన్స్ వస్తుందని ముందే చెప్పాడు. ఆ లెక్కన మొత్తం ఇప్పటివరకూ ఐదు టాస్కులు జరగ్గా అందులో మూడింట్లో బ్లూ టీమ్ గెలవగా.. గ్రీన్, రెడ్ టీమ్ చెరో టాస్కు గెలిచాయి. ఇలా ఒక్కో టీమ్ లో నుండి మొత్తంగా మెగా ఛీఫ్ కోసం ఆరుగురు కంటెస్టెంట్స్ ఎంపిక అయ్యారు. ఇక నిన్న జరిగిన బస్తా టాస్క్ లో టేస్టీ తేజ, ప్రేరణ, హరితేజ గేమ్ నుండి అవుట్ అయ్యారు. ఇక నబీల్, నిఖిల్, అవినాష్ ఉండగా.. మొదటగా నిఖిల్, అవినాష్ కలిసి నబీల్ ని ఓడించినట్టుగా తెలుస్తోంది.
ఇక చివరి వరకు నిఖిల్, అవినాష్ ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన ఈ టాస్క్ లో.. అవినాష్ బ్యాగ్‌లో ఎక్కువ బాల్స్ ఉండటంతో హౌస్‌కి కొత్త మెగా చీఫ్ అయ్యాడు. మెగా చీఫ్ కావడంతో వచ్చే వారం నామినేషన్స్ నుంచి అవినాష్‌కి ఇమ్యూనిటీ దక్కనుంది. అలా బిగ్ బాస్ సీజన్-8 లో అయిదు(5)వ మెగా చీఫ్ అయ్యాడు అవినాష్. మొదటి మెగా చీఫ్ నబీల్ కాగా తర్వాత మెహబూబ్, ఆ తర్వాత గౌతమ్, విష్ణుప్రియ మెగా చీఫ్‌లు కాగా ఇప్పుడు అవినాష్ మెగా చీఫ్ అయ్యాడు.