బిగ్ బాస్ సీజన్-8 లో టాస్క్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న మొన్నటి దాకా రెండు క్లాన్ లు ఉండగా.. ఇప్పుడు అంతా ఒకటే క్లాన్ అని చెప్పాడు బిగ్ బాస్. ఇక టాస్క్ లలో భాగంగా రెడ్, గ్రీన్, ఎల్లో, బ్లూ టీమ్ లుగా విభజించాడు బిగ్ బాస్.
నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్ స్నో మ్యాన్ లో బ్లూ టీమ్ గెలవగా వారికి ఎల్లో కార్డ్ వచ్చింది. ఇక రెండో టాస్క్ పేరు ' పానిపట్టు యుధ్ధం'. ఇందులో ఒక్కో టీమ్ కి ఒక్కో వాటర్ ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్‌లో ఉన్న వాటర్ తగ్గకుండా చూసుకోవడం వారి భాద్యతే. బిగ్‌బాస్ అడిగినప్పుడు ఎవరి టీమ్‌కి సంబంధించిన ట్యాంక్‌లో అయితే నీరు తక్కువగా ఉంటుందో వారు ఛాలెంజ్ నుంచి తప్పుకోవాలి.. సమయానుసారం బజర్ మోగుతుంది.. ఆ సమయంలో మిగిలిన సభ్యుల నుంచి ఎవరైనా ఇద్దరు సభ్యులు ట్యాంక్‌లో నీటిని తగ్గించడానికి ప్రయత్నించొచ్చు అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. పృృథ్వీ గౌతమ్‌కి ఛాన్స్ వచ్చింది. దీంతో బ్లూ టీమ్‌ను టార్గెట్ చేశాడు గౌతమ్. ఈ క్రమంలో హరితేజను ఒకసారి పక్కకి లాగాడు. దీనిపై నిఖిల్ అడిగితే.. లాగకూడదని రూల్ బుక్‌లో ఉందా.. దమ్ముంటే ఆడు అంటూ సవాల్ చేశాడు గౌతమ్. ఆ తర్వాత బజర్ మోగగానే ఎవరి దాంట్లో తక్కువ ఉన్నాయో చెప్పండి అంటూ బిగ్‌బాస్ అడిగాడు. దీంతో ట్యాంక్‌లో తక్కువ వాటర్ ఉన్న బ్లూ టీమ్ ఔట్ అయిపోయింది. దీంతో హరితేజ ఇప్పటి నుంచి మీరే సంచాలక్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఆ తర్వాత ఛాన్స్ రాగానే నిఖిల్ లోపలికి వెళ్లి రెడ్ టీమ్‌పై విధ్వంసమే చేశాడు. వాటర్ దగ్గర కాపాలాగా ఉన్న ప్రేరణ-యష్మీ ఇద్దరినీ ఇష్టమొచ్చినట్లు లాగి పారేశాడు. సంచాలక్ హరితేజ వద్దన్నా వినకుండా ఉన్మాదిలా ప్రవర్తించాడు నిఖిల్. ప్రేరణ, యష్మీలను పట్టుకొని అటు ఇటు విసిరేస్తూ, లాగేస్తూ రచ్చ చేశాడు. నన్నే రూల్స్‌లో ఉందా చూసుకో అంటూ బుక్ విసిరాడు.. ఇలా చేయకూడదని రూల్స్‌లో ఉందా అంటూ వాదించాడు నిఖిల్.
ఇక బజర్ మోగిన తర్వాత నిఖిల్ బయటికి వచ్చాడు. దీంతో సంచాలక్‌కి గౌరవం ఇవ్లలేదని అడుగుతారు కానీ మీరే పాటించరు అంటూ నిఖిల్‌పై యష్మీ అరిచింది. తర్వాత గౌతమ్ కూడా నిఖిల్‌పై ఫైర్ అయ్యాడు. చేయి పట్టుకొని ఆపడం వేరు.. లాగి, పీకి ఆడటం వేరు.. సెన్స్ లేదా.. అక్కడ అమ్మాయి అనే సెన్స్ లేదా.. నీకు అంటూ నిఖిల్‌పై గౌతమ్ అనగా.. నీకుందా అంటూ నిఖిల్ కూడా ఫైర్ అయ్యాడు. ప్రేరణ కూడా తిట్టడంతో మైండ్ యూ ఆర్ వర్డ్స్.. అంటూ నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ బుక్ విసిరి దమ్ముంటే ఆడదాం పదా అన్నాడంటూ నిఖిల్ కోపంగా అనగా.. బుక్ విసరడానికి మనిషిని విసరడానికి తేడా లేదా.. నువ్వు ఆపింది కరెక్టే కానీ ఆపిన పద్ధతే రాంగ్ అంటున్నా అంటూ గౌతమ్ అన్నాడు. అసలు నువ్వు ఆపడమే రాంగ్ అంటున్నానంటూ నిఖిల్ అన్నాడు. అది రూల్ బుక్‌లో ఉంటే చూపియ్ అంటు గౌతమ్ అన్నాడు. ఊరికే ఓవర్ యాక్టింగ్ చేయకు పో అంటూ నిఖిల్ అనగా.. నువ్వు చేసేదిరా ఓవర్ యాక్టింగ్..