ఎక్స్ట్రా జబర్దస్త్" షో ఈ వారం మంచి కామెడీని అందించింది. ఇందులో ఒక్కొక్కరి స్కిట్ ఒక్కో స్పెషాలిటీ అని చెప్పొచ్చు. అందులో రాంప్రసాద్ స్కిట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. దేన్నైనా మార్కెట్ చేయగల టాలెంట్ ఉన్న రోల్ లో ఆటో రాంప్రసాద్, సెక్సీ సన్నీ చేశారు. "ఆల్ ఇన్ వన్ ఎంటర్ప్రైజెస్ " దేన్నైనా అమ్మేస్తాం అనే కాన్సెప్ట్ తో ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ స్టార్ట్ చేసాడు రాంప్రసాద్. పిన్ నుంచి ఏరోప్లేన్ వరకు అన్నీ సేల్ చేసేస్తాం.
మా దగ్గర అంత మంచి బ్రాండ్స్ కూడా ఉంటాయి అని చెప్పాడు. "ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ రష్మీ కూడా నా దగ్గరకు వచ్చి నేను పాపులర్ కావాలి.. ఏదైనా చెయ్యి" అని అడిగింది. "కొంచెం తగ్గించు అని చెప్పా..పెర్ఫార్మెన్స్ కాదు.. బట్టలు తగ్గించు అన్నా..ఇప్పుడు స్టార్ ఐపోయింది..మా బ్రాండ్ డ్రెస్ వేసుకుంది మరి " అని రష్మిని చూపించాడు. "రీసెంట్ గా జేమ్స్ కెమరూన్ టైటానిక్ 2 కి బామ్మా క్యారెక్టర్ కోసం రష్మిని అడిగారు..అలాగే బాలీవుడ్ నుంచి నాకు కొంతమంది ఫోన్ చేశారు..రష్మీ ఎంత తీసుకుంటుంది అని అడిగారు..పది లక్షలు తీసుకుంటుందని చెప్పా" అన్నాడు. తరువాత రాంప్రసాద్ కంపెనీలో ఏసీ కొనడానికి వచ్చిన "నేను స్టూడెంట్ సర్" టీంకి ఏసీ ఎంతలా పని చేస్తుందో చూపించాడు. కొట్టుకునే కపుల్స్ తమ కంపెనీ ఏసీ వాడితే గొడవ పడడం మర్చిపోతారని...కొట్టుకునే ఫ్రెండ్స్ తమ కంపెనీ టీ షర్ట్ వేసుకుంటే కొట్టుకోవడం మర్చిపోయి ఫ్రెండ్స్ ఐపోతారంటూ, పెళ్ళైన వాళ్ళు తమ దగ్గర మంచం కొంటే చాలు పిల్లలు పుట్టేస్తారని ఇలా తమ కంపెనీ బ్రాండ్స్ గురించి యాడ్స్ చేసి చూపించాడు.