"పవన్ కళ్యాణ్ గారి మూవీ పేరు అత్తారింటికి దారేది...ఈ స్టార్ మాలో మనల్ని ఎవర్రా ఆపేది ? " అని మంచి జోష్ తో బ్రహ్మముడి మానస్ చెప్పేసాడు.."రోడ్డు మీద ఉంది వీధి లైటు, అయ్యా మాతో పెట్టుకోవద్దు ఫైటు" అన్నాడు ప్రిద్వి ప్రిన్స్ అలియాస్ నాగపంచమి సీరియల్ మోక్ష చెప్పాడు. ఈ వారం "ఆదివారం విత్ స్టార్ మా పరివారం" షోకి ఈ రెండు సీరియల్ టీమ్స్ వచ్చి రకరకాల గేమ్స్ ఆడి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
"హీరో అనేవాడు హీరోయిన్ తో రీల్ చేస్తాడు..కానీ నేనేంటో అత్తమ్మతో రీల్ చేయాల్సి వస్తోంది" అంటూ మానస్ బ్రహ్మముడిలో తన అత్తగారు నీపాతో కలిసి "చిన్నదమ్మే చీకులు కావాలా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. దాంతో శ్రీముఖి "కావ్య నీకు ఓకే కదా వాళ్ళు ఇద్దరి డాన్స్ చేయడం" అని అడిగేసరికి "కావ్య అలియాస్ దీపికా రంగరాజన్...మానస్ హీరోగా నీపా హీరోయిన్ గా స్టార్ మా ఇంకో సీరియల్ వస్తుంది" అని చెప్పింది కావ్య. నాగపంచమి సీరియల్ హీరో సైలెంట్ గా ఉండేసరికి "ఏంటి మోక్ష చాలా సైలెంట్ గా ఉన్నావ్" అని శ్రీముఖి అడిగేసరికి "ఫీవర్ వచ్చింది" అని చెప్పాడు. దాంతో "మోక్షకి ఆడపిల్లలంతా దిష్టి పెట్టేస్తుంటే జ్వరం వచ్చేస్తుంది మరి" అంది శ్రీముఖి. వెంటనే ఫైమా "ఇరుగు దిష్టి, బ్రహ్మముడి దిష్టి" అన్ని పోవాలి అంటూ దిష్టి తీసేసింది. ఐతే ఈ షోకి శ్రీముఖి ప్రతీ వారం తన పెద్ద పాలేరు అవినాష్ ని చిన్న పాలేరు హరిని పిలుస్తుంది. కానీ ఈ వారం ప్రసారం కాబోయే షోకి మాత్రం పెద్ద పాలేరు అవినాష్ కనిపించలేదు. హరి, ఫైమా మాత్రమే సీరియల్ టీమ్స్ కి సపోర్టింగ్ గా నిలిచారు. ఫైనల్ గా సీరియల్ హీరోయిన్స్ వాళ్ళ వాళ్ళ హీరోస్ ని మేకప్ చేసే టాస్క్ లో కొంతలో కొంత నాగపంచమి సీరియల్ హీరోయిన్ చక్కగా తయారు చేసింది. మరి ఈ ఆదివారం ప్రసారమయ్యే ఈ షోలో ఇంకేం ట్విస్టులు ఉన్నాయో చూస్తేనే తెలుస్తుంది.