డ్రామా జూనియర్స్ సీజన్ 6 మెగా లాంచ్ ప్రోమోని రిలీజ్ చేసింది జీ తెలుగు. 11 వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ప్రోగ్రాంని ప్రసారం చేయబోతోంది. ఇక ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్..జడ్జెస్ గా బాబూమోహన్, జయప్రద, శ్రీదేవి వచ్చారు. దీని ప్రోమోని వెరైటీగా టీవీలో వచ్చే హెడ్ లైన్స్ లా డిజైన్ చేశారు. "యాంకర్ ప్రదీప్, నటీనటులైన జయప్రద, బాబూమోహన్, శ్రీదేవిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు" అనే బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ అయ్యింది ఈ ప్రోమో...వీళ్ళను ఒక గదిలో కట్టేసి డ్రామా జూనియర్స్ లో పార్టిసిపేట్ చేసే చిల్డ్రన్ కంటెస్టెంట్స్ అంతా వచ్చి భయపెడుతూ ఉంటారు.
"ప్రదీప్ ని కుర్చీకి కట్టేసి ఒక అపరిచితుడు వేషంలో ఒక చిన్నారి వచ్చి నీకు ఏ శిక్ష కావాలో కోరుకో ..సూల దండనమా, కుంభీపాకమా, క్రిమీ భోజనమా" అని అడిగేసరికి మరో చిన్నారి లాయర్ వచ్చి "వదిలేయ్" అంటుంది. మరో గదిలో బందీగా ఉంది నటి శ్రీదేవి దగ్గరకు ఒక చైల్డ్ కంటెస్టెంట్ యమధర్మ రాజు వేషంలో వచ్చి భయపెడతాడు "ఎవర్రా మీరంతా" అని శ్రీదేవి అడుగుతుంది. అలాగే ఇంకో గదిలో ఉన్న బాబూమోహన్ దగ్గరకు ఇద్దరు చిన్నారులు వెళ్లి గలాటా చేస్తారు. ఫైనల్ గా జయప్రద మేకప్ రూమ్ లో మేకప్ చేసుకుంటూ ఉంటుంది. "మూడు గంటలయ్యింది..ఎవరో తెలీదు నన్ను మేకప్ రూమ్ లోకి తీసుకొచ్చి లాక్ చేశారు" అంటూ ఉండగా కొంతమంది చైల్డ్ కంటెస్టెంట్స్ కమల్ హాసన్, సావిత్రి గెటప్స్ లో ఆమె దగ్గరకు రావడం అలా అందరిని ఒక చోట చేర్చి పిల్లలు రౌండప్ చేయడం చాలా ఫన్నీగా డిజైన్ చేశారు..."వీళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి బ్లాక్ చేశారు. మీరింకా మీ రిమోట్స్ ని లాక్ చేయండి. మేమే కాదు మీరు కూడా వీళ్ళ అల్లరి భరించాల్సిందే... డ్రామా జూనియర్స్ సీజన్ 6 ..తెలుసుగా ఈసారి పెర్ఫార్మెన్సులు బద్దలైపోతాయి.." అంటూ నలుగురూ చెప్పారు.