స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -111 లో.... వెన్నెలను వర్ణిస్తూ రాహుల్ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే స్వప్నని తీసుకొని అప్పు, కళ్యాణ్ లు అక్కడికి వస్తారు.. రాహుల్ వెన్నెలకి ప్రపోజ్ చేసింది స్వప్న విని ఏడుస్తూ బయటకు వస్తుంది. స్వప్నతో పాటు అప్పు వచ్చి.. చూసావా నిన్ను ఆ రాహుల్ ఎంత మోసం చేసాడో, కావ్యక్క నీకు ఎంత చెప్పిన నువ్వు వినలేదు కదా అని అప్పు తిడుతుంది.
ఆ తర్వాత రాహుల్ తప్పు చేసాడని కావ్య సాక్ష్యం తీసుకొని వస్తుంది. బయట స్వప్న ఏడుస్తూ ఉండడం చూసి.. అక్క ఇప్పటికైనా ఈ రాహుల్ గురించి తెలుసుకున్నావా? నేను నిన్ను ఎప్పుడు చెడుగా భావించలేదు.. నిన్ను రాహుల్ మోసం చేస్తున్నాడని ఎప్పటికప్పుడు చెప్పినా నువ్వు వినలేదని కావ్య అంటుంది. పక్కనే ఉన్న అప్పు.. స్వప్నక్క ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఏంటక్కా తొందరపడ్డావ్.. అమ్మానాన్నలకి తలవంపులు తెచ్చావని అంటుంది. స్వప్న ఏడుస్తూ ఉంటుంది. ఇలా ఏడవడం కాదు ఆ రాహుల్ కి బుద్ది చెప్పాలని కావ్య అంటుంది. ఆ తర్వాత స్వప్న ని తీసుకొని లోపలికి వెళ్తుంది. అప్పుడే రాహుల్ వెన్నెలకి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడుగుతుంటాడు. కావ్య, స్వప్నలను చూసి షాక్ అయిన రాహుల్.. రింగ్ తొడగాకుండా ఆగిపోతాడు. ఏంటి అని అందరూ వెన్నక్కి చూస్తారు. "ఏంటి రాహుల్ ఆగిపోయావ్.. ఆ రింగ్ తోడిగే ముందు మా అక్క చేతికి ఉన్న రింగ్ ని తీసేయ్" అని కావ్య అంటుంది. అలా కావ్య మాట్లాడేసరికి అక్కడ ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్క జరిగిందంతా చెప్పు అని కావ్య అనగానే.. స్వప్న నిజాలన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రాహుల్ నన్ను మోసం చేసావా? ఇన్ని రోజుల నుండి తప్పించుకొని తిరిగేది.. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమేనా? నాలా ఈ అమాయకురాలి జీవితం కాకూడదని ఇక్కడి వరకు వచ్చానని స్వప్న అంటుంది. "రాజ్ ఆ రోజు పెళ్లి పీటల నుండి నేను పారిపోలేదు.. ఈ రాహులే నన్ను లేవదీసుకుపోయాడు. మీ నెంబర్ ఇవ్వమంటే తన నెంబర్ ఇచ్చి నన్ను ఇంప్రెస్ చేసాడు. పెళ్లి చేసుకుంటానని అన్నాడు. పెళ్లి వరకు వచ్చాక ఇలా చేసాడు.. నన్ను తీసుకెళ్లి ఒక హోటల్ లో ఉంచాడు. ఆ తర్వాత మా ఇంటికి వెళ్ళాను పెళ్లి చేసుకుందామంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని నన్ను మర్చిపో అని చెప్పాడు" అని స్వప్న జరిగిందంతా చెప్తుంది. రాహుల్ మాత్రం అదంతా అబద్దం అని అంటాడు.. ఒక్క సాక్ష్యం అయిన ఉందా అని రాహుల్ అంటాడు.
ఆ తర్వాత నాకు తెలుసు రాహుల్ నువ్వు ఇలా అంటావని అందుకే సాక్ష్యం తీసుకొని వచ్చానని కావ్య చెప్తుంది. స్వప్నని తీసుకొని రాహుల్ హోటల్ కి వెళ్లే సీసీటీవీ ఫుటేజ్ ని కావ్య అందరికి చూపిస్తుంది. రాజ్ అదంతా నమ్మకని రాహుల్ అంటాడు. దాంతో రాజ్ కోపంగా రాహుల్ చెంప పగలగొడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.