స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఏ సీరియల్ కి లేనంత ఫ్యాన్ బేస్ ఈ 'గుప్పెడంత మనసు' సీరియల్ కి ఉంది. తాజాగా ఒక కొత్త సీరియల్ ప్రారంభం కాగా గుప్పెడంత మనసు సీరియల్ టైం స్లాట్ ని చేంజ్ చేసి ఆ కొత్త సీరియల్ ని ప్రసారం చేయడంతో.. గుప్పెడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తమ నిరసనలు తెలుపుతూ.. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లలో విపరీతంగా పోస్ట్ లు చేసారు. అయితే ఈ సీరియల్ ప్రోమో విడుదలైన గంటలోనే అత్యధిక వ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. ఈ సీరియల్ కి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో దీన్ని బట్టే తెలుస్తుంది.
ఈ సీరియల్ లో రిషి గా ముఖేష్ గౌడ చేస్తుండగా, వసుధారగా రక్ష చేస్తుంది. రిషికి అమ్మనాన్నలు మహేంద్ర,జగతి కాగా, పెద్దమ్మ పెద్దనాన్నలు దేవయాని, ఫణింద్ర భూషణ్. దేవయాని-ఫణీంద్రల కొడుకు శైలేంద్ర భూషణ్ రీసెంట్ గా కథలోకి వచ్చాడు.ఇప్పుడు మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. కథలో కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీతో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. నిన్న మొన్నటిదాకా శైలేంద్ర విలనిజంతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ సీరియల్.. ఇప్పుడు మరో కొత్త అమ్మాయిని పరిచయం చేస్తుంది. రిషీధారలు విడిపోయారు.. జగతిని వదిలి వసుధార వెళ్ళిపోయింది. రిషి గమ్యం ఎటువైపుకి? శైలేంద్ర కన్నింగ్ ప్లాన్స్ కి అడ్డుకట్ట వేసేదెవరు లాంటి ఆసక్తికరమైన అంశాలతో గుప్పెడంత మనసు సరికొత్తగా మారుతుంది.
జగతి, వసుధారలు చేసిన మోసానికి కుమిలిపోయిన రిషి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోయాడు. అయితే తాజాగా విడుదలైన ప్రోమో మరింత అసక్తిని కలుగజేస్తుంది. శైలేంద్ర మనుషులకి రిషికి కనిపిస్తాడు. దాంతో వాళ్ళు శైలేంద్రకి కాల్ చేసి చెప్పగా.. అతను రిషిని చంపేయమని చెప్తాడు. అదే సమయంలో కార్ ఆగిపోయి ఒక అమ్మాయి సహాయం కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతో రిషి ఆ కార్ ఏ ప్రాబ్లం వల్ల ఆగిపోయిందో చూస్తుంటాడు. అదేసమయంలో రిషి బాగా తెలిసినట్టుగా ఆ అమ్మాయి.. మీరు రిషి కదా అని అంటుంది. దీంతో ఆ అమ్మాయికి రిషి ముందుగానే తెలిసినట్టుగా ఉంది. అయితే ఆ అమ్మాయి ఎవరు? రిషిని శైలేంద్ర మనుషులు ఏం చేస్తారు? రిషీధారలు మళ్ళీ కలిసేదెప్పుడు.. లాంటి ఆసక్తికరమైన విషయాలతో ఈ కథ ముందుకు సాగుతుంది. మొత్తానికి గుప్పెడంత మనసు ఫ్యాన్స్ కి తర్వాతి ఎపిసోడ్‌లలో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటిని పెంచేసాడు డైరెక్టర్.