స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రోజుకో ములుపు తిరుగుతూ ఎపిసోడ్ -70 లోకి అడుగుపెట్టింది. కాగా గురువారం రోజు జరిగిన ఎపిసోడ్ లో.. కృష్ణపై మురారి అరవడంతో కృష్ణ గదిలోకి వెళ్లి బాధపడుతుంది. ఆ తర్వాత కాసేపటికి మురారి వెళ్లి కృష్ణకి సారీ చెప్తాడు. అయినా తను సారీని యాక్సెప్ట్ చేయకుండా అలాగే ఉండడంతో కృష్ణని నవ్వించే ప్రయత్నం చేస్తుంటాడు. తను ఎలా ఉంటుందో డ్రాయింగ్ వేస్తాడు. అది కృష్ణ చూస్తుంది. "మీరు నా డ్రాయింగ్ వెయ్యడమేంటి.. సారీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టను.. మాట్లాడకుండా ఉండను.. మీరు గొప్ప ACP సర్" అని అంటుంది కృష్ణ. నేను బయట ACP నే కానీ ఇంట్లో కృష్ణకి భర్తనని అని మురారి అంటాడు. కృష్ణ, మురారిలను పిలుస్తుంది రేవతి. "మురారి.. నా కోడలు మీద ఎందుకు అరిచావ్" అని రేవతి అనగానే "మళ్ళీ సారీ చెప్పాడు అత్తయ్యా" అని కృష్ణ అంటుంది. నీకేం తెలియదు ఆగు కృష్ణ అని "నా కోడలు మీదకి అరిచావ్ కాబట్టి దానికి నువ్వు కృష్ణను మూవీకి తీసుకెళ్ళు" అని చెప్తుంది. సరే తీసుకెళ్తాను అని మురారి అంటాడు. వీళ్ళ మాటలు విన్న ముకుంద "రేవతి అత్తయ్యకు నా గురించి తెలిసిందా? తెలిసి ఇలా వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుందా" అని అనుకొని.. వాళ్ళు వెళ్ళాలనుకున్న కార్ టైర్ లో గాలి తీస్తుంది. కృష్ణ, మురారి లు బయటికొచ్చేసరికి కార్ టైర్ పంచర్ అవ్వడం చూసి.. వెంటనే మురారి బైక్ తీసుకొని వచ్చి కృష్ణని ఎక్కించుకు తీసుకెళ్తాడు. దీంతో ముకుంద "కార్ లో వెళ్తే అయినా దూరంగా వెళ్ళేవాళ్ళు.. ఇప్పడు టైర్ గాలి తీసి బైక్ మీద వెళ్ళేటట్టు చేసి ఇంకా దగ్గర చేసానా" అని అనుకుంటుంది ముకుంద.
వాళ్ళు అలా కలిసి వెళ్లడంతో కోపంగా ఆలోచిస్తూ తను మురారి కలిసి దిగిన సెల్ఫీనీ చూస్తూ ఉంటుంది. ఇంతలోనే నందు వచ్చి ఫోన్ లాక్కొని వెళ్లడంతో.. ఇంట్లో ఎవరైనా ఆ ఫోటో చూస్తారేమో అని టెన్షన్ పడుతుంది ముకుంద. అప్పుడే భవాని వచ్చి "ఏం జరుగుతుంది ఇక్కడ" అంటూ నందు దగ్గర ఉన్న ఫోన్ తీసుకునేసరికి.. స్క్రీన్ ఆఫ్ అవ్వడంతో ముకుంద కూల్ అవుతుంది.
అందరూ భోజనం చేస్తుండగా ముకుంద రాకపోవడంతో రేవతి పిలుస్తుంది. ముకుంద కిందకి రావడం.. అప్పుడే మూవీకి వెళ్లిన కృష్ణ, మురారిలు రావడంతో వాళ్ళ వైపే చూస్తుంది ముకుంద. అలా చూస్తున్న ముకుందని రేవతి గమనిస్తుంది. "అక్క నేనొక విషయం చెప్పాలి. ఆదర్శ్ రావాలంటే ముకుంద సౌభాగ్యవతి వ్రతం చెయ్యాలని పంతులు గారు చెప్పారు" అని భవానీతో రేవతి అంటుంది. "వ్రతం చేస్తే ఆదర్శ్ రావడం ఏంటీ.. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ప్రెజర్ పెట్టాలి. ఒక టీంతో వెతికించాలి అప్పుడు ఆదర్శ్ ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది" అని అంటుంది కృష్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.