![]() |
![]() |

బిగ్ బాస్ నిన్న గాక మొన్న సీజన్ పూర్తయ్యిందో లేదో ఇప్పుడు రాబోయే సీజన్ కోసం కంటెస్టెంట్ల వేట మొదలైనట్టు కనిపిస్తోంది. అంతేకాదు కొంత మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఐతే ఇప్పుడు బుల్లితెర నటులు అమరదీప్-తేజస్విని గౌడా ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో పాల్గొంటారనే ప్రచారం జరుగుతోంది. "జానకి కలగనలేదు" సీరియల్ తో రామా పాత్రలో అమరదీప్ ఫేమస్ అయ్యాడు. అలాగే "కేరాఫ్ అనసూయ" సీరియల్ లో శివాని పాత్రలో తేజస్విని ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే విషయం గురించి రీసెంట్ గా అమరదీప్ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పాడు. బిగ్ బాస్ లోకి అవకాశం వస్తే వెళతారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు "ఊ చూద్దాం" అని తలూపాడు. ఐతే ప్రస్తుతం ఇద్దరికీ పెళ్లయ్యింది కాబట్టి జంటగా వెళ్తారనే టాక్ కూడా వినిపిస్తోంది అనేసరికి "అది కష్టం.
తేజూకు జీ-తమిళ్ సీరియల్ ఉంది. కాబట్టి దాన్ని వదిలేసి రాలేదు. ఇక్కడి డేట్స్, అక్కడి డేట్స్ మ్యానేజ్ చేయడానికే కష్టమైపోతోంది. ఒకవేళ అక్కడ పర్మిషన్ ఇస్తే వెళ్తారు అని మళ్ళీ అడిగేసరికి "ఒక ఎపిసోడ్ షూటింగ్ కే మేము ఒక్క రోజు లేకపోతేనే మాకు బ్యాటింగ్ ఉంటుంది. ఇక రెండు సీరియల్స్ అంటే చాలా హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది." అని చెప్పాడు అమరదీప్.
![]() |
![]() |