![]() |
![]() |

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమెడియన్ ముక్కు అవినాష్. తన కామెడీతో ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటాడు. అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అలా అవినాష్ ఇప్పుడు ఒక హోదా దక్కించుకున్నాడు. మూవీస్ లో, బుల్లితెర షోస్ లో నటిస్తూ ఫుల్ బిజీగా మారాడు. శ్రీముఖితో కలిసి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు.
ఇప్పుడు అవినాష్ తన ఊరు జగిత్యాలకు తన భార్య అనూజాతో కలిసి వెళ్ళాడు. ప్రతీ డిసెంబర్ లో జగిత్యాల జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో గొల్లపల్లి మండల కేంద్రంలో ఉన్న గ్రామం మల్లన్నపేటకు వస్తానని చెప్పాడు అవినాష్. అక్కడ 'దొంగ మల్లన్న' స్వామి వారికి బోనాలు సమర్పించారు ఇద్దరు. ఇక్కడ వెలసిన దొంగ మల్లన్న స్వామి చాలా పవర్ ఫుల్ అని ఏది కోరుకుంటే అది జరుగుతుంది అన్నాడు. అసలు దొంగ మల్లన్న స్వామికి ఆ పేరెందుకు వచ్చిందని వాళ్ళ బ్రదర్ ని అడిగేసరికి అప్పట్లో కొంత మంది ఆవుల్ని దొంగిలించుకుని తీసుకెళ్లేటప్పుడు మధ్యలో కొందరు చూసేసరికి వాళ్లకు ఎక్కడ దొరికిపోతామేమోననే భయంతో మల్లికార్జున స్వామి వారి విగ్రహం దగ్గరకు వెళ్లి తమను గుర్తుపట్టకుండా ఆవుల రంగులోకి మార్చితే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. వాళ్ళ కోరికను స్వామి వారు తీర్చడంతో ఆ దొంగలు స్వామికి రాత్రికి రాత్రే గుడి కట్టేశారని చెప్పాడు. అలా అప్పటినుంచి దొంగ మల్లన్న స్వామిగా ఇక్కడ భక్తుల పూజలందుకుంటున్నాడట. ఇక ఫ్రెష్ గా తీసిన తాటి కల్లు తాగి పండగను ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఎంజాయ్ చేసాడు అవినాష్. ఈ వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసాడు.
![]() |
![]() |