Home  »  TV News  »  Karthika Deepam2 : సుమిత్ర తండ్రిగా ఎంట్రీ ఇచ్చిన దక్షిణామూర్తి.. గతాన్ని తవ్వుతున్న దీప, కార్తీక్!

Updated : May 12, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -667 లో......శివన్నారాయణ ఇంటి ముందు ఒక పెద్దాయన నిల్చొని ఉంటాడు. అప్పుడే దీప, కార్తీక్ వస్తారు. ఏంటి పెద్దాయన ఇక్కడున్నారు.. ఎవరు కావాలని అడుగుతాడు. ఈ ఇంట్లో వాళ్ళు నీకు తెలుసా అని అతను అడుగుతాడు. అందరు తెలుసని కార్తీక్ చెప్తాడు. శివన్నారాయణ గారికి కుడి భుజంలాంటి వాడిని అని కార్తీక్ చెప్తాడు. మీరు శివన్నారాయణ, చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అనుకుంటా అని కార్తీక్ అడుగుతాడు. కొంచెం అలాగే అని అతను చెప్తాడు. పైనుండి పారిజాతం చూస్తుంది. కార్తీక్ గాడు ఎవరితో మాట్లాడుతున్నాడని అనుకుంటుంది.

రండి లోపలికి వెళదామని కార్తీక్ అతన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు. పారిజాతంపై నుండి అతన్ని చూసి షాక్ అవుతుంది. ఈ ముసలోడు అతన్ని చూస్తే రక్తపాతం జరుగుతుంది. వెంటనే వెళ్లి ఆపాలని పారిజాతం కిందకి వెళ్తుంది. హడావిడిగా వెళ్తుంటే శివన్నారాయణకి డ్యాష్ ఇస్తుంది. ఏంటి కంగారుగా వెళ్తున్నావనేసరికి కార్తీక్ అతన్ని తీసుకొని లోపలికి వస్తాడు. అతన్ని చూసి శివన్నారాయణ షాక్ అవుతాడు. పట్టరాని కోపంతో నువ్వు ఎందుకు వచ్చావని అడుగుతాడు. ఎవరు మావయ్య అని సుమిత్ర వస్తుంది. అతన్ని చూసి సుమిత్ర చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేస్తుంది. నువ్వా అని కోపంగా మొహం తిప్పుకుంటుంది. నేనే అమ్మ నీ నాన్నని అని అతను అంటాడు. దక్షిణామూర్తి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేదంటే మర్యాద ఉండదని శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు. నేను నా కూతురు కోసం వచ్చానని దక్షిణామూర్తి అంటాడు.

నీకు కూతురు ఎక్కడ ఉంది. నీ ముర్కత్వంతో కూతురు చనిపోయిందని పిండప్రధానం చేసి కర్మకాండ జరిపించినప్పుడే నీ కూతురు చనిపోయిందని సుమిత్ర అంటుంది. ఇప్పుడు మీరు వెళ్లకపోతే నా చావునే చూస్తారని గోడకి తలని కొట్టుకుంటుంది సుమిత్ర. దాంతో సుమిత్ర కిందపడిపోతుంది. ఇక అందరు కలిసి గదిలోకి తీసుకొని వెళ్తారు. కార్తీక్ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు. దక్షిణామూర్తి ఇక్కడ నుండి వెళ్లమని శివన్నారాయణ కోప్పడతాడు. మీరే నా ఇంటికి వచ్చే రోజు వస్తుందని చెప్పి అతను వెళ్ళిపోతాడు. అతను మా తాత అని దీప అంటుంది. నా తాత ఉన్నాడంటే ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా అని పారిజాతం దగ్గర అసలు విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు కార్తీక్, దీప. అక్కడే జ్యోత్స్న కూడా ఉంటుంది. పారిజాతం ఏదో చెప్పబోతుంటే శివన్నారాయణ వచ్చి కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.