"సుమ అడ్డా" లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి ఆలీ, పోసాని కృష్ణ మురళి వచ్చారు. ఇక వాళ్ళతో కలిసి సుమ మంచి ఫన్ చేసింది. ఈ సందర్భంగా కృష్ణ మురళి గారు మీ నాన్న గారి గురించి చెప్పండి అని అడిగేసరికి "మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. ఆయనకు ఏ అలవాట్లూ లేవు. కానీ ఎవడో పేకాట నేర్పాడు. ఊళ్ళో ఎవరో ఒకరు అంటారు కదా..ఎందుకు సుబ్బారావు నువ్విలా చేస్తావు అని అడిగేసరికి ఆయనకు ఆయన సమాధానం చెప్పుకోలేక పొలం వెళ్లి అక్కడ చనిపోయాడు." అని ఆయన బాధను షేర్ చేసుకున్నారు.
ఇక ఆలీ గురించి చెప్తూ "ఒక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఎన్ని యుగాల నుంచి ఉన్నారు ఆలీ గారు" అని చెప్పేసరికి ఆలీ ఫుల్ ఖుషీ ఇపోయారు. "రాజా రాజా రాజా అని మీరు ఎన్ని సార్లు అన్నారో నేను నా రాజా కూడా అన్ని సార్లు అనలేదు" అని పోసాని డైలాగ్ మీద కౌంటర్ వేసింది సుమ. "ఇంతకు సెల్ ఉండడం మంచిదా లేకపోవడం మంచిదా..మీకు వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లేదు" అని సుమ పోసానిని అడిగేసరికి "ఎందుకు అవన్నీ..ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్, అప్పుడప్పుడు చిన్న చిన్న మెసేజెస్" చాలు అన్నారు పోసాని. ఇంతకు మీ ఫోన్ ఏది అని ఆలీని అడిగేసరికి "సగం కొరికి పెట్టాడే ఎంగిలి చేసింది.అది నాది..నువ్వు కూడా కోరుకుతావా" అని తన ఆపిల్ ఫోన్ గురించి చెప్పేసరికి "వద్దు, వద్దు" అంది సుమ భయపడుతూ.
సుమ అడిగిన ప్రశ్నకు ఒక స్టూడెంట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పింది. ఆలీ ఒక చాకోలెట్ తీసుకెళ్లి ఆ స్టూడెంట్ కి ఇచ్చి షాక్ హ్యాండ్ ఇచ్చేసరికి "కూతురికి పెళ్ళైనా ఇవేం తగ్గలేదసలు" అని సైడ్ డైలాగ్ వేసింది సుమ.