![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ షో లేటెస్ట్ ప్రోమోలో సినీ యాక్టర్స్ అంతా వచ్చారు. న్యూటన్స్ 3rd లా మూవీ టీమ్ నుంచి అవసరాల శ్రీనివాస్, సుమంత్, రవి వర్మ, కథానాయిక నేహా పఠాన్, త్రినాధ్ వర్మ వీళ్లంతా వచ్చారు. ఇక హోస్ట్ రష్మీ అవసరాల శ్రీనివాస్ ని ఒక ప్రశ్న అడిగింది. "మ్యారేజ్ లైఫ్ లో ఒక లా గురించి చెప్పాలంటే మీరేమంటారు " అంది. "మీ వైఫ్ ఏ "లా " చెప్తే అ "లా" చేసుకుంటూ పోతే చాలు" అన్నాడు. "అదే బై లా" అని అంది రష్మీ. ఇక తర్వాత టేస్టీ తేజ శ్రీనివాస్ తో ఒక డిస్కషన్ పెట్టాడు పెళ్లి గురించి. "అన్నా అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు.
ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు స్వాతంత్య్రం అన్నారు. పెళ్ళైన మగాడు ఏడవకుండా బాత్రూం నుంచి బయటకు రావడమే స్వాతంత్య్రం. ఏమంటారు" అనేసరికి నవ్వుతూ తలూపారు . "ఏవండీ జాఫర్ గారు పెళ్ళికి ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అంటే అప్పుడు అర్ధం కాలేదు ఇప్పుడర్ధమయ్యింది గాడిద చాకిరి చేయాలి కాబట్టి ఆ మాట అన్నారని" అన్నాడు తేజ. దానికి రవి వర్మ వుంది అందులో నిజం ఉంది అన్నాడు. "అంటే ఇప్పుడు నాకు వంట రాదండి పాపం కస్టపడి వాళ్ళు వంట చేస్తారు కాబట్టి గిన్నెలు నేనే తోముతా" అని చెప్పారు. "రవి గారు అదృష్టవంతులు వంట వచ్చి ఉంటే రెండూ ఆయనే చేయాల్సి వచ్చేది" అంటూ అవసరాల శ్రీనివాస్ ఫన్నీగా కౌంటర్ ఇచ్చారు.
తర్వాత సింగిల్స్ బెటరా మింగిల్ ఐతే బెటరా అనే కాన్సెప్ట్ మీద ఒక డిబేట్ నడిచింది. దానికి పృద్వి బాధ్యత వచించారు. "పెళ్లిళ్లు చేసుకుంటే పెళ్ళాలు మంచిగా వండిపెడతారుగా" అని జోర్దార్ సుజాత. వెంటనే అవసరాల శ్రీనివాస్ "జైల్లో ఖైదీలకు కూడా వండి పెడుతున్నారు." అన్నారు. "అంటే ఖైదీ బతుకు పెళ్లి చేసుకున్నోడి బతుకు ఒకటే అంటారా " అంటూ రాకేష్ అడిగేసరికి "స్క్రిప్ట్ లోనే ప్రశ్నలు అడిగితె కష్టంగా ఉంటుంది" అన్నారు శ్రీనివాస్ కామెడీగా. "పెళ్లి చేసుకోకుండా సొసైటీలో ఎం సాధిద్దామనుకుంటున్నారండి" అంటూ రాకేష్ అరిచేసరికి అవసరాల శ్రీనివాస్, ఆటో రాంప్రసాద్ "పెళ్లి చేసుకుని మీరేం సాధించారు" అంటూ లేచారు. సుజాత లేచి ఒక వయసొచ్చాక తోడు కావాలి అనేసరికి శ్రీనివాస్ అప్పుడు తోడు పెరుగు కోసం పక్కింటికి మనల్నే పంపిస్తారు అన్నారు. పెళ్లి చేసుకుంటే చిలక గోరింకల్లా ఓకే ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు అని రాకేష్ అనేసరికి "దానికి లివ్ ఇన్ ఉంది కదండీ " అంటూ నటుడు సుమంత్ ఆన్సర్ ఇచ్చారు. లివ్ ఇన్ అంటే మంచిదేగా అన్నారు పృద్వి. అంతే ఖతం.
![]() |
![]() |