![]() |
![]() |

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 టైటిల్ విన్నర్ సింగర్ రేవంత్ గురించి అందరికీ తెలుసు. టైటిల్ నాదే అనే చెప్పి బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి టైటిల్ తోనే తిరిగొచ్చాడు. సింగర్ రేవంత్ తోటి కంటెస్టెంట్ శ్రీహాన్ రన్నర్ గా వచ్చాడు.
ఇక రేవంత్ విన్నర్ అయ్యాడు మరో వైపు తండ్రి కూడా అయ్యాడు. టైటిల్ ని తీసుకెళ్లి తన కూతురికి బహుమతిగా ఇచ్చాడు...ఇక రేవంత్ తన పాప ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. పాప పుట్టాక వచ్చిన ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున ఇంట్లో భోగి పళ్ళు పోసి వేడుక చేసాడు. ఈ సెలబ్రేషన్ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. పాప చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. "మకర సంక్రాంతి శుభాకాంక్షలు …మన చిట్టి తల్లి వచ్చాక సంక్రాంతి సంబరాలు !!! బొమ్మలకొలువు & భోగిపళ్లు !" అని కాప్షన్ పెట్టారు. టాలీవుడ్ స్టార్ సింగర్స్ లో రేవంత్ కూడా ఒకరు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ మాత్రమే కాదు గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్ కూడా.
ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక బుల్లితెర మీద షోస్ కి స్పెషల్ ఇన్విటేషన్ అందుకుంటున్నాడు రేవంత్. అలాగే బయటికి వచ్చాక హౌస్ మేట్స్ తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నాడు. అలాగే ఇంటర్వ్యూస్ లో కూడా బాగా కనిపిస్తున్నాడు.
![]() |
![]() |