Home  »  TV News  »  Jayam Serial: వీరు అబద్ధాన్ని కనిపెట్టిన రుద్ర.. శకుంతల ఎంట్రీతో కథలో సరికొత్త ట్విస్ట్!

Updated : May 23, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -276 లో.. సుధా వాళ్ళ ఇంటికి వీరు వస్తాడు. విశ్వ బాబాయ్ కి ఎలా ఉందని మాట కలుపుతాడు వీరు.  తప్పిపోయిన మీ కూతురు.. అదే నా  చెల్లిని నేను కూడా వెతుకుతాను పిన్నీ తన ఫోటో ఏదైనా ఉందా అని వీరు అడుగగానే తను తీసుకొచ్చి ఇస్తుంది. ఇక సుధా తీసుకొచ్చిన ఫోటో కాపీని తన ఫోన్ తో ఫోటో తీసుకుంటాడు వీరు. ఇమ అదంతా గమనించిన పైడీరాజు, లక్ష్మీలని బయటకు వెళ్ళి మీ పనులు మీరు చేస్కోండి అని చెప్తాడు వీరు. గంగనే వాళ్ళ కూతురు అని తెలిస్తే వీరు ఏదైనా చేస్తాడేమోనని లక్ష్మీ టెన్షన్ పడుతుంటే పైడిరాజు తనకి ధైర్యం చెప్తాడు. వెంటనే రుద్రకి కాల్ చేసి వీరు వచ్చిన విషయం చెప్తాడు.

ఇక రుద్ర, గంగా ఇద్దరు కలిసి సుధా వాళ్ళింటికి వస్తుంటారు. అదేసమయంలో శకుంతల పెట్టిన ఆవకాయని సుధాకి తీసుకెళ్ళాలని పెద్దసారు, రంగా అనుకుంటారు. మెల్లిగా వెళ్తుంటే అప్పుడే శకుంతల చూస్తుంది. ఇక వాళ్ళు కార్ లో వెళ్తుంటే అదే సమయంలో ఇషిక, సూర్య ఆఫీస్ కోసమని బయల్దేరుతుంటారు. వెంటనే వారితో పాటు కార్ లో ఎక్కుతుంది శకుంతల. పెద్దసారుని ఫాలో చేయమని చెప్తుంది. సూర్య ఫాస్ట్ గా వెళ్తూ రంగా, పెద్దసారుల కార్ ని ఫాలో చేస్తాడు. ఇక వీరు బయల్దేరి వెళ్తుండగా అప్పుడే అక్కడికి రుద్ర, గంగా వస్తారు. ఎక్కడికి వీరు అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. ఏంటి వీరు ఇలా వచ్చావని అడుగగా విశ్వ బాబాయ్ కి బాలేదు కదా.. మొన్న ఫంక్షన్ లో పిన్నీతో బాగా మాట్లాడలేదు కదా అందుకే వచ్చానని వీరు కవర్ చేయాలని చూస్తాడు. విశ్వకి దెబ్బలు తాకాయని మేము ఎవరికి చెప్పలేదు కదా అని రుద్ర అనగానే వీరు షాక్ అవుతాడు. అది మనం ఒకే ఇంట్లో ఉంటాం కదా.. మాట్లాడుకునేటప్పుడు విన్నాడేమోనని గంగ అనగానే అవునని.. పెద్దసారు అంటే విన్నానని అంటాడు. పెద్దసారే నన్ను ఇక్కడికి పంపించారని వీరు అంటాడు. ఇక అప్పుడే అక్కడికి పెద్దసారు, రంగా వస్తారు. 

పెద్దసారుని చూసి సుధా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అన్నయ్య.. అంటు సుధా అనగానే నీకోసమే శకుంతలతో ఆవకాయ పచ్చడి పెట్టించా.. నా చేతులతో ఇద్దామని వచ్చానని పెద్దసారు అంటాడు. ఇక వీరుని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. అదేంటి మీరే పంపించారని వీరు చెప్పాడు. లేదు నేను చెప్పలేదని పెద్దసారు అనగానే వీరు షాక్ అవుతాడు. ఎలా కవర్ చేయాలో అర్థం కాదు.. అప్పుడే గంగ కవర్ చేస్తుంది. ఇక విశ్వ ఇంటికి వస్తాడు. ఇంటి బయట శకుంతల, సూర్య కార్ లో ఉండగా వీరుకి ఇషిక కాల్ చేసి మేము బయటనున్నాం.. పెద్దసారుని శకుంతల చూసేసింది అని చెప్పగానే వీరి షాక్ అవుతాడు. నేను లోపలే ఉన్నాను .. ఎలాగైనా చేసి శకుంతల అత్తయ్యని తీసుకెళ్ళమని ఇషికని రిక్వెస్ట్ చేస్తాడు. మరోవైపు పెద్దసారు, గంగ, రుద్ర అంతా విశ్వ వాళ్ళని చూస్తాడేమోనని టెన్షన్ పడతారు. ఇక నేను కవర్ చేస్తానని చెప్పి అప్పుడే పైడిరాజు బయటకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.