![]() |
![]() |

యాడ్స్ లో కొత్త ట్రెండ్ స్టార్ట్ ఐనట్టుగా కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్లనే ఎక్కువగా యాడ్స్ కి ప్రిఫర్ చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు బుల్లితెర మీద పాపులర్ ఐనా, అవుతున్న వాళ్ళతో కూడా యాడ్స్ అనేవి చేయడం స్టార్ట్ అయ్యింది.
ఇప్పుడు అలాంటి ఒక యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బుల్లితెర మీద యాంకర్ గా ఫేమస్ ఐన రవి, జబర్దస్త్ కమెడియన్ గా క్లిక్ ఐన రాకింగ్ రాకేష్, అలాగే మరో నటుడు, ఇంకొంత మంది లేడీస్ తో కలిసి "యువర్ ఫాబ్రిక్ ఫియాన్సీ..లూయిస్ పార్క్" అంటూ లైనెన్ షర్ట్స్ యాడ్ లో వీళ్ళు కనిపించారు. ఇక యాంకర్ రవి గురించి అలాగే జబర్దస్త్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "సంథింగ్ స్పెషల్" ప్రోగ్రాంకి యాంకర్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు రవి. 2017 లో "ఇది నా ప్రేమకథ" అనే సినిమాలో హీరోగా చేసాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత హీరోగా ట్రయల్స్ వేయడం మానేసాడు..కొన్ని మూవీస్ లో సైడ్ క్యారెక్టర్స్ చేసాడు. బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేదు కానీ స్మాల్ స్క్రీన్ మీద యాంకర్ గా ఫుల్ సక్సెస్ అయ్యాడు. సోషల్ మీడియాలో అప్ డేట్ గా ఉంటాడు. అలాగే బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా చేసాడు.
ఇక రాకింగ్ రాకేష్ బుల్లితెర మీద అంచలంచెలుగా ఎదుగుతూ కమెడియన్ నుంచి టీం లీడర్ స్థాయికి వచ్చాడు. జోర్దార్ సుజాతతో ప్రేమలో పడి త్వరలో పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యాడు. వీళ్ళిద్దరూ రీసెంట్ గా దుబాయ్ వెళ్లొచ్చారు..న్యూ ఇయర్లో బెజవాడ దుర్గమ్మను కూడా దర్శించుకున్నారు. సోషల్ మీడియాలో ఈ జంట మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పుడు రాకేష్ ఈ యాడ్ లో నటించాడు. ఆ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసుకున్నాడు..అలాగే "కొత్త సంవత్సరంలో ఓసారి.. కొత్త యాడ్ తో మీ ముందుకు" అని కాప్షన్ పెట్టుకున్నాడు. అలా రాకేష్ కొత్త కొత్త అవకాశాలను అందుకుంటున్నాడు.
![]() |
![]() |