![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఒక ప్రత్యేక శైలి కలిగిన కంటెస్టెంట్. తన గాత్రంతో ఫ్యాన్స్ ని సంపాదించుకొని, బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన చివరి కంటెస్టెంట్. బిగ్ బాస్ ప్రతీ సీజన్ ఫినాలే ఎపిసోడ్స్ లో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ యొక్క జర్నీ వీడియోను లీస్ట్ నుండి చూపించడం అలవాటు.
రేవంత్ జర్నీ వీడియో మొదట ప్లే చేసాడు బిగ్ బాస్. దీంతో విశ్లేషకులు ఈ సారి రేవంత్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. జర్నీ వీడియో ప్లే చేసే ముందు బిగ్ బాస్ మాట్లాడుతూ "ఇది ఫిజకల్ గేమ్స్ కి సంబంధించినది కాదు. ఇది పర్సనాలిటీ గేమ్. ఎవరి వ్యక్తిత్వం ఏంటో తెలిపే రియాలిటీ షో. ఇప్పటి వరకు మీరు మీ ఆటను ఫిజికల్ గా మాత్రమే చూసారు. కానీ మీ కోపం సరైనది కాదు. ఇక్కడ మనిషి యొక్క అన్ని ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకొని ఉండగలగాలి. మీరు తండ్రి అయ్యే క్షణాలలో మీ వాళ్ళ దగ్గర లేకుండా బిగ్ బాస్ కోసం త్యాగం చేసారు. మీ వాళ్ళకి దూరంగా ఉండి, గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్ళాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఇక ముందు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి" అని చెప్పాడు.
"థాంక్స్ బిగ్ బాస్. నేను తెలిసో, తెలియకో హౌస్ మేట్స్ ని ఇబ్బంది పెట్టాను. అందరికీ ఇప్పుడు సారీ చెప్తున్నా, ఇక నుండి నా కోపాన్ని మార్చుకుంటాను. నా వాళ్ళ కోసం కష్టపడతాను. నేను టైటిల్ గెలిచి ఆ కప్ నా కూతురికి బహుమతిగా ఇస్తాను. థాంక్స్ ఫర్ జర్నీ వీడియో. వేరే లెవెల్ బిగ్ బాస్" అంటూ రేవంత్ ఎమోషనల్ అయ్యాడు.
![]() |
![]() |