బిగ్ బాస్ సీజన్ 8 మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ కి మధ్య చాల టఫ్ ఫైట్ నెలకొంది. మేల్స్ లో నిఖిల్, గౌతమ్, ఫీమెల్స్ లో యాష్మి, ప్రేరణ బాగా గట్టి పోటీ ఇచ్చారు. ఇక ప్రేరణ లేడీ సింగం అనే పేరు కూడా తెచ్చుకుంది. కానీ కప్పు మాత్రం నిఖిల్ పట్టుకుపోయాడు. అలాంటి ప్రేరణ తనకు బిగ్ బాస్ టైటిల్ వస్తుందని అనుకుందట..ఐతే మరేమయ్యింది. ఎందుకు విన్ కాలేదు అనే విషయాల మీద ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్స్ ఇచ్చింది.
"నేను నాలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాను. నాలాగే బయటకు వచ్చాను. ఒక గేమ్ ప్లే చేయాలని అనుకోలేదు. ఏదైనా స్ట్రాటజీ ప్లే చేసినా ఏదో ఒక పాయింట్ లో అది అందరికీ తెలిసిపోతుంది. జనాలు ఇష్టపడితే ఇష్టపడతారు...లేదంటే తిడతారు. ఇక మీడియా కూడా ఏమన్నా నాలాగా లేకపోతె గనక బిగ్ బాస్ ని కూడా క్లోజప్ లో చూపించారు..మమ్మల్నే చూపిస్తారు. నా బెస్ట్ ఇవ్వడానికి వెళ్లాను. నేను నా మైండ్ లో ఏదైతే అనిపించిందో అదే నిజాయితీగా చెప్పేసాను. అది కొంతమందికి నచ్చలేదు. నోటి దూల అన్నారు చాలామంది కానీ రెండు సార్లు అనుకోకుండా కొన్ని మాటలు వచ్చేసాయి వాటికి చాలా బాధపడ్డాను. మేము ప్రతీది లైఫ్ లో కష్టపడేది డబ్బులు కోసమే. బిగ్ బాస్ హౌస్ లో 105 డేస్ ఉన్నాం. మొత్తం ఇచ్చేస్తున్నాం..ఫ్రీగా ఎవరూ చేయరు. డబ్బులు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కానీ డబ్బే ముఖ్యం అని కాదు. నా టైం, నా కంటెంట్, నా డ్రామా అంతా పెట్టి ఆడినందుకే వాళ్ళు డబ్బులు ఇస్తారు. తీసుకుని వచ్చేస్తాం.. అసలు ఎంత ఇస్తారో నాకే పూర్తిగా తెలీదు...అసలు అలా ఎలా ఊహించేస్తారు అంతా. నిజానికి నేను విన్నర్ కావాల్సింది..చాలా కష్టపడ్డాను. బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ హిస్టరీలో ఇప్పటివరకు ఎప్పుడూ ఒక లేడీ విన్ కాలేదు. నేను గెలవాలని గట్టిగా కోరుకున్నా. రష్మిక మందన్న ఇప్పుడు నేషనల్ క్రష్ కానీ తాను నా చడ్డీ,బడ్డీ ఫ్రెండ్. మా మధ్య ఒక టీజింగ్ ఫ్రెండ్ షిప్ ఉండేది. ఫ్రెండ్ షిప్ టైంలో నేను రష్మికని ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉండేదాన్ని. ఏ ఫ్రెండ్ ని ఐనా అలాగే తిట్టేసేదాన్ని..ఐతే బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం తన గురించి పొగిడేసరికి రష్మికాకు ఏడుపొచ్చేసి తన గురించేనా ఇలా చెప్తోంది అని అనుకుంది రష్మిక" అని చెప్పింది ప్రేరణ.