![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -470 లో.....సుకన్య పాలలో ఏదో పౌడర్ కలుపుతుంది. ఆ పాలు తాగి చందు వల్లిని దగ్గరికి తీసుకుంటాడు. ఒక్క నిమిషం బావ అని వల్లి బయటకు వచ్చి సుకన్యకి ప్లాన్ సక్సెస్ అని చెప్తుంది. మరి ఇక్కడ ఉన్నావేంటి చందు దగ్గరకి వెళ్ళమని సుకన్య చెప్తుంది. మరొకవైపు ధీరజ్ తో ప్రేమ మత్తులో ఉండి డ్యాన్స్ చేస్తుంది. అలాగే సాగర్ తో నర్మద డ్యాన్స్ చేస్తుంది. అక్కడ మన సుకన్య ఇచ్చిన ఐడియాతో వల్లి అల్లుడు ఒకటి అయ్యి ఉంటారని భాగ్యంతో ఆనందరావు అంటాడు.
మరుసటిరోజు ప్లాన్ సక్సెస్ అయినందుకు వల్లి కోసం సుకన్య పాయసం చేస్తుంది. అప్పుడే నర్మద వస్తుంది. ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఏం లేదు మా వల్లికి కడుపు పండుతుంది కదా అందుకే స్వీట్ అని సుకన్య అనగానే అదేంటి ఆల్రెడీ వల్లి ప్రెగ్నెంట్ కదా అని నర్మద అంటుంది అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి స్వీట్ పెడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అని సుకన్య అంటుంది. అయినా నర్మదకి డౌట్ గానే ఉంటుంది. సుకన్య పాయసం తీసుకొని వెళ్లి వల్లికి ఇస్తుంది. వల్లి వెళ్లేసరికి డల్ గా ఉంటుంది. ఏమైందని సుకన్య అడుగగా నేను నీ దగ్గర నుండి వచ్చేసరికి బావ గుర్రుపెట్టి నిద్ర పోయాడని వల్లి చెప్తుంది. అంటే పాలల్లో ఎక్కువ డోస్ కలిపాన అని సుకన్య అంటుంది.
అది నర్మద విని పాలల్లో ఏం కలిపావని అడుగుతుంది. చందు, వల్లితో సరిగా ఉండడం లేదు కదా వాళ్ళు కలిసి ఉంటే అయినా వల్లిపై కోపం పోతుందేమోనని అందులో పౌడర్ కలిపానని సుకన్య చెప్తుంది. అవును చెల్లి బావ నేను ఏదో ప్రెగ్నెంట్ అని తీసుకొని వచ్చాడు కానీ నా మొహం కూడా చూడట్లేదని వల్లి చెప్తుంది. దాంతో నర్మద సైలెంట్ గా వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమతో ధీరజ్ రాత్రి తను ఏం చేసిందో చెప్తాడు. నేను ఏం చేసానురా.. అమాయకూరాలిని అని ప్రేమ అంటుంది. అవునా అంటూ ప్రేమని ధీరజ్ దగ్గరికి తీసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |