![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు Podharillu . ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ 178లో.. రుద్రవరం, గ్రామ దేవత గురించి తెలుసుకున్న తర్వాత చక్రి, కేశవ, నారాయణ, మాధవ, పెద్ది, మహా, మనీషా అందరు కలిసి ఊరికి బయల్దేరాలని నిర్ణయించుకుంటారు. మనీషాను ఒంటరిగా వదిలి వెళ్లడం ప్రమాదం.. తనని కూడా తీసుకెళ్దామని కేశవ, చక్రి అంటారు. మరోవైపు శైలుతో కేశవ మాట్లాడుతుంటాడు. నన్ను ఎప్పుడు తీసుకెళ్తావని శైలు అడుగుతుంది. మన పెళ్లి అయ్యాక అని కేశవ చెప్పడంతో, మన పెళ్లి ఎప్పుడు అని అడిగుతుంది. మా పెద్దన్నయ్యది అయ్యాక అని కేశవ చెప్తాడు. ప్రయాణానికి అందరు సిద్ధమవుతుండగా చక్రి, మహా మధ్య హిందీ విషయంలో సరదా సంభాషణ జరుగుతుంది. చివరకు నారాయణ కొబ్బరికాయ కొట్టి.. ఇంతకాలం ఈ ఊరికి దూరంగా ఉన్నాను.. ఇప్పుడు తప్పడం లేదు.. నువ్వే కాపాడాలి అమ్మా అని గ్రామ దేవతను వేడుకుని బయల్దేరుతాడు.
కారు రుద్రవరం వైపు వెళ్తుండగా అందరు నిశ్శబ్దంగా ఉండటంతో కన్నా అంత్యాక్షరి ఆడుకుందామా అని అంటాడు. ఇంతలో ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో అందరు కారు దిగి దాన్ని పక్కకు జరపడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో నారాయణను చంపడానికి వచ్చిన రౌడీలు దాడి చేస్తారు. కానీ చక్రి, కేశవ, కన్నా, మాధవ, మహా, మనీషా అందరయ కలిసి నారాయణకు అడ్డుగా నిలబడి రౌడీలను చితక్కొడతారు. నాన్న. జాగ్రత్త అని చక్రి అనడంతో నారాయణ భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు ఈ దాడి వెనుక నారాయణ బామ్మర్ది, రమణయ్యల కుట్ర ఉందని తెలుస్తుంది. నారాయణ మాత్రం తిరిగి రాకూడదని రమణయ్య చెప్పగా.. వాడు లేకపోతే ఆ బృందావనం నాదే అవుతుందంటూ తన స్వార్థాన్ని బయటపెడతాడు. నారాయణ కుటుంబం రుద్రవరంలోకి చేరిన తర్వాత గుడి అడ్రస్ తెలియక ఇబ్బంది పడుతుండగా.. సతీష్ సత్రం గురించి చెప్తాడు.
చివరకు నారాయణ కుటుంబం బైరి రమ, ఉపేంద్ర గౌడ్ నిర్మించిన సత్రానికి చేరుకుంటుంది. అదే సమయంలో తాయారు తన కూతురు గాయత్రి, అల్లుడిని కూడా రుద్రవరానికి తీసుకొస్తుంది. సత్రం బయటకు వచ్చిన గాయత్రికి నారాయణ కుటుంబం కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. బావ మాటలా వినిపిస్తోంది ఏంటి?” అంటూ బయటకు వచ్చిన గాయత్రిని చూసి కేశవ కూడా ఆశ్చర్యపోతాడు. నువ్వు ఏంటి ఇక్కడ ఉన్నావని ఇద్దరూ మాట్లాడుకుంటారు. గాయత్రి నాకు ఈ అడ్రెస్ తెలియదు.. నాకు మొక్కు ఉందని అమ్మ తీసుకొచ్చిందని చెప్తుంది. అయితే తాయారు మాత్రం మళ్లీ నారాయణ కుటుంబంపై విరుచుకుపడుతూ.. మీరు ఇక్కడికి కూడా దాపరించారా అని గొడవ చేస్తుంది. ఇలా ఒకే సత్రంలో రెండు కుటుంబాలు కలుస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |