![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -669 లో..... కార్తీక్, దీప, దాస్ ఆడుతున్న నాటకం గురించి పారిజాతానికి జ్యోత్స్న తెలిసేలా చేస్తుంది. మరి నువ్వు నా మనవరాలు అయినప్పుడు మీ అమ్మకి బోన్ న్యారో ఎలా ఇచ్చావని పారిజాతం అడుగుతుంది. నేను ఇచ్చానని చెప్పానా తన కన్నకూతురు ఇచ్చింది అని జ్యోత్స్న అనగానే పారిజాతం షాక్ అవుతుంది. అంటే తన కన్నకూతురు ఎవరు అని పారు అడుగుతుంది. తల్లికి కూతురు ఎవరో తెలియదు గానీ కూతురికి తల్లి తెలుసు కదా.. అందుకే తన తల్లిని కాపాడుకుందని జ్యోత్స్న చెప్తుంది. అంటే సుమిత్ర కూతురు ఎవరో నీకు తెలుసా అని పారు అడుగుతుంది. తెలుసని జ్యోత్స్న అనగానే పారు షాక్ అవుతుంది.
ఎవరే అని పారు అనగానే ఎవరో తెలిస్తే నీ గుండె ఆగుతుంది.. ఎవరో కాదు దీప అనగానే పారు షాక్ అవుతుంది. కొద్దిసేపు తనకి మైండ్ పని చెయ్యదంటే కావాలనే దాస్ చేత దీప నా మనవరాలు అని చెప్పించాడా అని పారు అడుగుతుంది. అవును నువ్వే వెర్రిదానిలాగా వాళ్ళు చెప్పింది చేస్తూ వచ్చావని జ్యోత్స్న అంటుంది. నీ మాటలు ఎలా నమ్మేది అని పారు అనగానే DNA రిపోర్ట్స్ చూపిస్తుంది. నాకు మా నాన్న దీప అసలైన వారసురాలు అని ఎప్పుడో చెప్పాడని జ్యోత్స్న చెప్తుంది. అంటే మీకందరికి తెలిసి నన్ను వెర్రిదాన్ని చేశారు.. మరి నువ్వు నాకు ఎందుకు నిజం చెప్పలేదని పారు అడుగుతుంది. చెప్తే నీ నోట్లో మాట ఆగదని చెప్పలేదని జ్యోత్స్న చెప్తుంది. అందరి సంగతి చెప్తానని పారిజాతం కోపంగా ఉంటుంది. ఇదే వద్దని చెప్పాను.. నీకు ఏం తెలియనట్లు ఎప్పటిలాగే ఉండు కథ నేను నడిపిస్తానని జ్యోత్స్న చెప్పగానే ఇద్దరు ఒకే అనుకుంటారు. ఆ తర్వాత నెల్లూరు రెస్టారెంట్ లో ఏదో ప్రాబ్లమ్ అని తెలిసి శివన్నారాయణ వెళ్ళాలని అనుకుంటాడు. రేపు బోర్డు మీటింగ్ నాన్న.. నువ్వు కార్తీక్ ఉండండి.. నేను వెళ్తానని దశరథ్ అంటాడు.
ఆ తర్వాత దీప వంక పారిజాతం అదోలా చూస్తుంది. ఆ తర్వాత దీప వెళ్లిపోతూ పారిజాతం గారి చూపుల్లో ఏదో తేడా ఉందని కార్తీక్ తో దీప చెప్తుంది. అదేం లేదులే అని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప ఇంటికి వెళ్తారు. దక్షిణామూర్తి గురించి కాంచనని కార్తీక్ అడుగుతాడు. కాంచన తన చేతిలో గ్లాస్ కింద పడేస్తుంది.. ఎందుకు అందరు ఇలా రియాక్ట్ అవుతున్నారని కార్తీక్ అనగానే ఇంకొకసారి అతని గురించి అడిగితే నేను చచ్చినంత ఒట్టే అని కాంచన కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |