బెల్లంకొండ గణేష్ "స్వాతిముత్యం" మూవీతో తానేంటో తన నటన ఏంటో నిరూపించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు "నేను స్టూడెంట్ సర్" అనే మూవీ చేసాడు. అది రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజతో చిట్ చాట్ చేశారు. ఆడియన్స్ అడిగిన ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చెప్పాడు. "అన్న లాగా కమర్షియల్ స్క్రిప్ట్స్ కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నారు..కారణం ఏమిటి" అని అడిగిన ప్రశ్నకు " కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి రీజన్ అంటూ ఏమీ లేదు. డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేసి ఆడియన్స్ కి చూపించాలంటే ఇష్టం నాకు. ప్రస్తుతానికి నాకు మార్కెట్ లేదు.
హీరోగా ఇంకా మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డిఫరెంట్ జానర్స్ లో చేసి నేను ఏ రోల్ ఐనా చేయగలను అనే నమ్మకాన్ని డైరెక్టర్స్ కి ఇవ్వాలని అనుకుంటున్నా. అలాంటి జానర్స్ లో ఎంచుకున్నవే స్వాతిముత్యం, ఇప్పుడు చేసిన నేను స్టూడెంట్ సర్ మూవీస్. నెక్స్ట్ ఒక క్రైమ్ కామెడీ రాబోతోంది. "మీరు ఒక వేళ మూవీస్ లోకి రాకపోయి ఉంటే ఏం చేస్తూ ఉండేవారు" అని అడిగిన ప్రశ్న "నేను పుట్టింది ఇండస్ట్రీలోనే కాబట్టి అందులోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవాడిని" అని చెప్పాడు. "మీరు ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఎవరు " "వెంకటేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు" అని చెప్పాడు.
"నా దగ్గర ఒక మంచి స్క్రిప్ట్ ఉంది..మీకు సెట్ అవుతుంది..." అని అడిగేసరికి " ఎవరినైనా కాంటాక్ట్ అవ్వు లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ ఇవ్వు నేను నీకు రిప్లై ఇస్తాను" అని చెప్పాడు. '' నేను స్వాతిముత్యం కంటే ముందు ఒక సినిమా చేశా..చాలా వరకు షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇంతలో కోవిడ్ వచ్చేసరికి మూవీ ఆగిపోయింది..ఇకపోతే నాకు ఇండస్ట్రీలో ఉన్నది ఇద్దరు ఫ్రెండ్స్ అభిరాం దగ్గుబాటి, బాలకృష్ణ గారి అబ్బాయి మోక్షజ్ఞ..అభిరామ్ మూవీ కూడా నా మూవీతో పాటే రిలీజ్ అయ్యింది.. తేజ గారి డైరెక్షన్ లో కాబట్టి ..నీకు ఆ మూవీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా...ఇక పొతే నేను నటించిన నేను స్టూడెంట్ సర్ మూవీలో నా పక్కన హీరోయిన్ గా చేసింది అవంతిక దాసాని.. ఆమె సీనియర్ యాక్టర్ భాగ్యశ్రీ గారి కూతురు " అంటూ ఎన్నో విషయాలు చెప్పాడు బెల్లంకొండ గణేష్.