బిగ్ బాస్ సీజన్-8 లో గత వారం నుండి విన్నర్ ఎవరా అనే క్యూరియాసిటి అందరిలో నెలకొంది. ఇక హౌస్ లో ఉన్న అయిదుగురిలో ఒక్కొక్కరికి తమ జర్నీ వీడియోలని అద్భుతంగా ఎడిట్ చేశారు బిగ్ బాస్. మొదటగా గౌతమ్ జర్నీ వీడియో చూపించగా, రెండోది అవినాష్, మూడు నిఖిల్, నాల్గవది ప్రేరణ జర్నీ వీడియో చూపించగా చివరగా నబీల్ జర్నీ వీడియోని చూపించాడు బిగ్ బాస్.
నబీల్ గురించి బిగ్‌బాస్ చెప్పిన మాటలని ఓసారి చూసేద్దాం. నబీల్.. లైక్ షేర్ సబ్‌స్కైబ్ నుంచి లైట్స్ కెమెరా యాక్షన్ వరకూ మీ ప్రయాణాన్ని తీసుకెళ్లాలనే మీ తొమ్మిదేళ్ల తపన మిమ్మల్ని ఈ స్థానంలో నిల్చోబెట్టింది.. వరంగల్ కా షేర్ అనే పేరు ఇప్పుడు ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు.. మీ టాలెంట్‌ని మీ వ్యక్తిత్వాన్ని కోట్ల మంది ప్రేక్షకుల వద్దకు చేర్చేందుకు ఈ ప్టాట్‌ఫామ్ ద్వారా మీకు వచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం మీరు సద్వినియోగం చేసుకున్నారు. నామినేషన్స్‌లో మీరు చూపించిన ఫైర్ కానీ టాస్కులో మీరు చూపించిన పట్టుదల కానీ మీ పేరును అందరూ అండర్లైన్ చేసేలా చేసింది.. మెగా చీఫ్ ప్రామిస్ చేయడంలోనైనా.. ఎవిక్షన్ షీల్డ్ త్యాగం చేయడంలోనైనా ఉన్నతంగా ఆలోచించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపించారు..నబీల్.. మీరు సెల్ఫ్ మేడ్.. అందుకే మీకు ఆత్మ గౌరవం కూడా ఎక్కువే.. దాన్ని ప్రశ్నించింది ఎవరైనా వారికి దీటుగా మీ ఆటతో జవాబిచ్చారు.. ఈ ఇంటి మొదటి మెగా చీఫ్‌గా నిలిచారు.. ప్రయాణం మధ్యలో మీలో ఫైర్ తగ్గిందని మీ తోటివాళ్లు చెప్పినప్పుడు.. మీ సామర్థ్యాన్ని మీరు ప్రశ్నించుకున్నారు. అప్పటి నుంచి అందరికీ ఆమోదయోగ్యంగా మారేందుకు మీరు పడిన తపన స్పష్టంగా కనిపించింది..
మీ చుట్టూ ఉన్న తారల తళుకుబెళుకల మధ్య ఒక సామాన్యుడిగా ఒంటరై నిలిచినట్లు మీకు అనిపించింది.. కానీ నబీల్ అది మీ బలహీనత కాదు అదే మీ బలం.. టాప్-5లో ఒకరిగా నిలిచిన మీ ప్రయాణం చూసి యావత్ ప్రేక్షక లోకమే కాదు ఇప్పుడు బిగ్‌బాస్ కూడా మనస్ఫూర్తిగా అంటున్నారు వెల్ ప్లెయిడ్ నబీల్.. ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఇప్పుడు ఓసారి చూద్దామంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇక తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు నబీల్. నోట మాట రావట్లేదని నబీల్ చెప్పాడు.. తన అమ్మ చెప్పిన మాటలని గుర్తుచేసుకున్నాడు నబీల్.