స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్ - 69 లోకి అడుగు పెట్టింది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్ లో... మురారి తన కార్ లో ఉన్న ముకుందను ఎవరైనా చూస్తారేమోనని కంగారుపడతాడు.
నా ప్రేమని చంపి ఆత్మవంచన చేసి ఈ నరకంలో పడేసావని ముకుంద అంటుంది. "ఏంటీ అది నరకమా.. నువ్వంటే ఫ్యామిలీలో అందరికి ఇష్టమే.. ఎందుకు అలా మాట్లాడుతున్నావ్" అంటూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు మురారి. అవేమీ వినకుండా ముకుంద అలానే మాట్లాడేసరికి... "జీవితాంతం నన్ను ద్వేషించేవాడిగా చూసినా పర్వాలేదు కానీ ప్రేమించేవాడిలా మాత్రం చూడకు" అంటూ కంటతడి పెడతాడు మురారి. అది చూసిన ముకుంద... ఏంటీ మురారి నువ్వు ఏడుస్తున్నావా? నువ్వు ఏడ్వకు నిన్ను గొప్ప ఆఫీసర్ గా చూడాలనుకుంటున్నా.. కానీ ఇలా కాదు నిన్ను బాధపెట్టినందుకు సారి అని చెప్తుంది.
మరోవైపు కృష్ణ కాపురం గురించి ఆలోచిస్తూ స్టవ్ మీద పాలు ఉన్న విషయం మర్చిపోయి మరి ఆలోచిస్తుంది రేవతి. ఇంతలో కృష్ణ వచ్చి.. ఏంటీ అత్తయ్య అలా ఉన్నారు అంటూ బీపీ చెక్ చేస్తుంది. "ఇంత బీపీ ఉందేంటి అత్తయ్యా.. దేని గురించి ఆలోచిస్తున్నారు" అంటుంది కృష్ణ. నువ్వు మురారి సంతోషంగా ఉంటున్నారా అని రేవతి అడుగుతుంది. దానికి కృష్ణ "ఏంటీ అత్తయ్య ఇలా అడుగుతుంది మురారి నేను దూరంగా ఉంటున్నట్టు తెలిసిందా" అని అనుకుంటుంది. మేం బాగుంటున్నాం. మురారి నన్ను ఒక్క మాట కూడా అనడు. మీకు తెలుసు కదా అంటుంది కృష్ణ. "మీ పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో అయిందో నాకు తెలుసు.. మీరు బాగుండాలి" అని రేవతి చెప్తుంది. మేము బాగుంటాం మా గురించి టెన్షన్ పడకండని కృష్ణ అంటుంది.
"కృష్ణ పెత్తనం నడుస్తుంది" అని అలేఖ్య, సుమలత ఇద్దరు మాట్లాడుకుంటారు. అది నందిని విని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. ఆ మాటలు విన్న రేవతి... వారిద్దరికీ స్ట్రాంగ్ కౌంటర్ వేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చిన మురారిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా.. ప్రశ్నలతో తనకి చిరాకు తెప్పిస్తుంది కృష్ణ. దాంతో మురారి "నా బాధలేవో నేను పడుతున్నాను. నన్ను వదిలేయ్" అంటూ అరిచేసరికి... కృష్ణ అక్కడి నుండి వెళ్లిపోతుంది. వాళ్ళ మాటలు అన్ని కూడా రేవతి వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.