"మిస్టర్ అండ్ మిస్సెస్" రియాలిటీ షో ప్రతీ వారం లాగే ఈ వారం కూడా అలరించడానికి సిద్దమయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో "స్కూల్ థీమ్" కాన్సెప్ట్ ఇచ్చారు. ఇక కంటెస్టెంట్స్ అంతా స్కూల్ డ్రెస్ లో వచ్చి టీచర్ అడిగిన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చారు.
జబర్దస్త్ కమెడియన్ అప్పారావు టీచర్ గా చేసాడు. ఇక వాళ్ళ టీంలోని స్టూడెంట్స్ ని కొన్ని ప్రశ్నలు వేసాడు. "మనకు దిక్కులు ఉన్నాయి కదా అవి చెప్పు" అనేసరికి "తూర్పు, పడమర, దక్షిణం" అని చెప్పేసరికి "ఉత్తరం ఏది అనేసరికి దాన్ని పోస్ట్ డబ్బాలో వేసా మాస్టారు" అని చెప్పాడు ఒక స్టూడెంట్..ఇంకో స్టూడెంట్ ని లేపి "మనకు సూత్రాలెన్ని అవి ఏవి" అని అడిగేసరికి "రెండు సూత్రాలు..మంగళసూత్రం, కామసూత్రం" అని ఆన్సర్ ఇచ్చేసరికి అప్పారావు బాదేశాడు. ఇక మరో జబర్దస్త్ కమెడియన్ షేకింగ్ శేషు టీచర్ గా వచ్చి తన స్టూడెంట్స్ ని కొన్ని క్వశ్చన్స్ వేసాడు. "చార్మినార్ ఎక్కడ ఉంది చెప్పు" అని స్టూడెంట్ గా ఉన్న రాకింగ్ రాకేష్ ని అడిగేసరికి "రోడ్డుకు అడ్డంగా ఉంది" అని జవాబు ఇచ్చాడు.
తర్వాత బుల్లితెర నటి కరుణ లేడీ టీచర్ గా వచ్చింది..ఆమె స్టూడెంట్స్ గా విశ్వా అతని వైఫ్ నటించారు " ఏంట్రా విశ్వా కళ్లద్దాలు పెట్టుకున్నావు" అని టీచర్ కరుణ అడిగేసరికి " ఇంత అందాన్ని డైరెక్ట్ గా చూస్తే నా కళ్ళు ఎఫెక్ట్ అవుతాయని కళ్లద్దాలు పెట్టుకున్నా" అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు. "చెట్లు ఎదగాలి అంటే ఏం చేయాలి" అని మళ్ళీ అడిగేసరికి "చెట్టు పక్కన కూర్చుని నువ్వు ఎదగాలి, నువ్వు ఎదగాలి" అంటూ ఉండాలి అని విశ్వా ఆన్సర్ చెప్పేసరికి అందరూ నవ్వేశారు. ఇలా నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ నవ్వించబోతోంది. ఇక లాస్ట్ లో ఎలిమినేషన్ రౌండ్ కొంచెం ఆసక్తిని రేపెలా ఉంది.