![]() |
![]() |

దీపికా రంగరాజు బుల్లితెర మీద ఆడియన్స్ ని నవ్విస్తూ షోస్ లో కామెడీ చేస్తూ సీరియల్ లో నటిస్తూ ఉంది. ఐతే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తనకు సంబందించిన కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది. "తెలుగు ఇండస్ట్రీలోకి రావడానికి ముందు తమిళ్ ఇండస్ట్రీలో చేసాను. కానీ ఇక్కడకి వచ్చాక తెలుగు వాళ్ళు నన్ను బిజీ చేసేసారు. తెలుగు వాళ్ళ ప్రేమ, అభిమానం నన్ను ఇక్కడ నుంచి కదలకుండా చేసేసింది. అందుకే వేరే లాంగ్వేజ్ లో చేయడానికి నాకు టైం కూడా లేదు. సీరియల్స్ చేస్తున్నాను, షోస్ చేస్తున్నాను.
ప్రతీ నెల ఏవో కొన్ని షోస్ చేస్తూనే ఉంటాను. అలా బిజీ ఐపోయాను. నాకే డేట్స్ దొరకట్లేదు. బ్రహ్మముడి చేస్తున్నాను. కావ్య రోల్ లో అందరికీ పరిచయమయ్యాను. షోస్ ప్రకారం ఐతే మాస్ జాతర చేస్తున్నాను. బ్రహ్మముడి నాకు లైఫ్ ఇచ్చిన షో. ఈ సీరియల్ ద్వారానే నేను అందరికీ తెలిసాను కాబట్టి నాకు ఈ సీరియల్ దొరకడం అదృష్టమని చెప్తాను.
అలాగే కూకు విత్ జాతిరత్నాలు షోలో కూడా చేస్తున్నాను. వంటలు చేయడమే రాదు నాకు. కానీ వాళ్ళు పిలిచారు. సో ఏదో ఒకటి చేయాలి కదా. వంట రాకపోయినా నవ్వించడం వచ్చు కదా అలా" అని చెప్పింది దీపికా. ఈమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకు ఎలాంటి ఆస్తి లేదని స్మశానంలో ఆరడుగుల నేల తప్ప అంటూ కామెంట్ చేసింది. దాంతో ఈ డైలాగ్ తో బ్రహ్మముడి కావ్య బాగా వైరల్ అయ్యింది.
![]() |
![]() |