![]() |
![]() |

జబర్దస్త్ 500 ఎపిసోడ్‌లో మంత్రి రోజా ఎంట్రీ ఇచ్చారు. ఆమె రాకతో స్టేజి మొత్తం కళకళలాడింది. రాఘవ తన స్కిట్ లో భాగంగా రాజు వేషంలో స్టేజి మీదకు వచ్చి "ఆవిడని ఎప్పుడో, ఎక్కడో చూసినట్టుందే" అని రోజాని చూపిస్తూ డైలాగ్ చెపాడు. కో-కమెడియన్ ఎంట్రీ ఇచ్చి "నీకు బాగా బలిసింది.. ఆవిడతో కలిసి తిరుపతి వెళ్లి ఫ్రీగా లడ్డులు తెచ్చుకుని ఇప్పుడు ఎవరూ అంటావా?" అనేసరికి రోజా పకపకా నవ్వేశారు.
ఇంతలో జడ్జి కృష్ణ భగవాన్ మాట్లాడుతూ "రోజా మేడం ఇక్కడ ఉన్నన్ని రోజులు మీమీద కౌంటర్లు వేసేవారు. ఇప్పుడు అక్కడ వేస్తున్నారనుకోండి" అని చెప్పి ఆమెను నవ్వించారు.
జబర్దస్త్ జడ్జెస్ గా రోజాకి, నాగబాబుకి మంచి పేరు ఉంది. తర్వాత నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు ఈ షో నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు 500వ ఎపిసోడ్ కి రోజా వచ్చి అందరినీ ఖుషి చేశారు. ఐతే ఆమెతో పాటు నాగబాబు కూడా వస్తే బాగుండేది కదా అని అభిమానులు అంటున్నారు.
![]() |
![]() |