స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -232 లో.... దాస్ కాశీ స్వప్నలు కలిసి కార్తీక్ ఇంటికి వస్తారు. మేము ఫుడ్ కోర్ట్ పెట్టాలనుకున్నాం కానీ అది ఇప్పుడు మీకు అవసరం. ఒక రెస్టారెంట్ పెట్టండి అని కార్తీక్ తో స్వప్న అనగానే.. మంచి ఆలోచన అని దాస్ అంటాడు. ఆ ఆలోచన సరైనదని అందరు అంటారు కానీ దానికి చాలా పెట్టుబడి కావాలని కార్తీక్ అంటాడు.
ఆ తర్వాత ఆస్తిలో నా వాటా అడుగుతానని కాంచన అనగానే వద్దమ్మ అది నీ ఆస్తి అని కార్తీక్ అనగానే.. నీది నాది అంటావేంటి అని కాంచన బాధపడుతుంది. అయినా వాళ్ళది వద్దని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత ఈ ఇంటి మీద లోన్ తీసుకుందామని కాంచన అనగానే.. కార్తీక్ సరే అంటాడు. కార్తీక్ రెస్టారెంట్ పేరు దీప రెస్టారెంట్ అని పెడుదామని అంటాడు. అందరు దానికి సరే అంటారు. ఆ తర్వాత దాస్ బయటకు వెళ్తుంటే అనసూయ వచ్చి.. దీప అమ్మ నాన్న ఎవరో తెలిసిందా అని అడుగుతుంది. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్తానని దాస్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి వస్తాడు దాస్. కార్తీక్ తన భార్య పేరున రెస్టారెంట్ పెడుతున్నాడు. వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతున్నారు.. వాళ్ళ జోలికి వెళ్ళకని జ్యోత్స్నకి దాస్ వార్నింగ్ ఇవ్వగా.. వెళ్ళానని జ్యోత్స్న అంటుంది.
ఆ తర్వాత జ్యోత్స్న వెళ్లి శివన్నారాయణకి విషయం చెప్తుంది. వాళ్ళ ఇంటికి లోన్ తీసుకొని రెస్టారెంట్ పెడుతున్నారంట అని జ్యోత్స్న అనగానే.. ఎవడి ఆస్తులు అనుకుంటున్నారంటూ శివన్నారాయణ కోపంగా జ్యోత్స్నని తీసుకొని కార్తీక్ ఇంటికి వెళ్తాడు. మరొకవైపు బ్యాంక్ మేనేజర్ కార్తీక్ ఇంటికి వచ్చి.. లోన్ కి అన్ని సంతకాలు పెట్టించుకుంటాడు. అప్పుడే శివన్నారాయణ, జ్యోత్స్న వస్తారు. ఆ తర్వాత కార్తీక్ నా భార్య దీప పేరు మీద రెస్టారెంట్ పెడుతున్నా అని అనగానే జ్యోత్స్న నాకు ఒక బుక్ కావాలి. దీప జీవిత చరిత్ర.. ఎక్కడో సైకిల్ పైన టిఫిన్ అమ్ముకునే వ్యక్తి.. ఇప్పుడు ఏకంగా స్టార్ హోటల్ కి యాజమాని అని శివన్నారాయణ వెటకారంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.