స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -230 లో......కార్తీక్ తన పోస్ట్ కి రాజీనామా చేస్తాడు. దాంతో వద్దని దీప రిక్వెస్ట్ చేస్తుంది. శివన్నారాయణ, జ్యోత్స్నలు దీపని తిడతారు. నా భార్యని ఏం అనొద్దంటూ కోప్పడుతాడు. అయిన దీప వద్దని అనడంతో ఇంకా ఇలా మాట్లాడిన కూడా నువ్వెందుకు ఇలా అంటున్నావని కార్తీక్ అంటాడు. రాజీనామా లెటర్ ని శివన్నారాయణకి ఇచ్చి.. దీపని తీసుకొని కోపంగా వెళ్లిపోతాడు. బావ వెళ్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావ్ తాతయ్య అని జ్యోత్స్న అనగానే.. వాడు ఎక్కడికి వెళ్లినా మళ్ళీ తిరిగిరావల్సిందే అని శివన్నారాయణ అంటాడు.
ఆ తర్వాత పారిజాతం స్వీట్స్ తీసుకొని దాస్ ఇంటికి వస్తుంది. మీకోక గుడ్ న్యూస్.. ఆ కార్తీక్ జాబ్ మానేసాడని స్వప్నకి చెప్పి స్వీట్స్ ఇస్తుంది పారిజాతం. అవునా మా అన్నయ్యకి ఫ్రీడం దొరికిందంటు పారిజాతానికి కౌంటర్ వేస్తుంది స్వప్న. బావ తలుచుకుంటే వాళ్ళ కంటే గొప్ప పొజిషన్ కి వెళ్తాడని కాశీ అంటాడు. ఆ తర్వాత దీప గురించి పారిజాతం తప్పుగా మాట్లాడుతుంటే.. వద్దని దాస్ అంటాడు. మరొకవైపు కార్తీక్, దీప లు ఒక దగ్గర ఆగి మాట్లాడుకుంటారు. ఎందుకు దీప ఏడుస్తున్నావని కార్తీక్ అడుగుతాడు. నా వల్ల మీ కుటుంబం నుండి విడిపోయారని దీప అంటుంది. నాకు కుటుంబం ఉందని కార్తీక్ అంటాడు.
మీరు జ్యోత్స్నని పెళ్లి చేసుకోండి కార్తీక్ బాబు అని దీప అనగానే.. పద ఆ పెద్దాయన దగ్గరికి వెళ్లి నీ మనవరాలిని నా భర్తకిచ్చి పెళ్లి చెయ్ అని అడుగు ఒప్పుకుంటే నీ తాళి ఇచ్చి తన మెడలో కట్టించు.. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో అప్పుడు చరిత్రలో మిగిలిపోతావని కార్తీక్ కోప్పడతాడు. నేను ఎప్పుడైనా జ్యోత్స్నతో మాట్లాడడం చూసావా.. ఇష్టమని ఎప్పుడైనా చెప్పానా.. నిన్ను ఇస్టపడి చేసుకున్నాను.. నువ్వేం చేసినా ఇష్టమని దీపతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్, దీప లు ఇంటికి వెళ్తారు. ఇప్పుడే వచ్చావ్ మళ్ళీ వెళ్తావా అని కాంచన అడుగుతుంది. మళ్ళీ వెళ్ళే అవసరం లేదని కార్తీక్ అనగానే.. ఏమైందని దీపని కాంచన అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.