స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -229 లో....కార్తీక్ ఆఫీస్ లో ఫైల్ గురించి వెతుకుతాడు. మేనేజర్ ని పిలిచి ఫైల్ ఎక్కడ అని అడుగుతాడు. ఆ ఫైల్ చైర్మన్ గారి దగ్గర ఉందని మేనేజర్ చెప్పగానే.. అదేంటీ నేను సంతకం పెట్టి అప్రూవల్ చెయ్యాలి కదా అని కార్తీక్ అంటాడు. ఏమో సర్ అని మేనేజర్ అనగానే కార్తీక్ కోపంగా శివన్నారాయణ దగ్గరికి వెళ్తాడు.
మరొకవైపు కార్తీక్ ఎంత గొడవ చేస్తాడోనని జ్యోత్స్న భయపడుతుంది. ఆ ఫైల్ పైన నేను సంతకం చేసి అప్రూవల్ చెయ్యాలని కార్తీక్ అనగానే చైర్మన్ ని నేను.. నేను చేస్తే చాలని శివన్నారాయణ అంటాడు. నా జాబ్ అది.. అలాంటప్పుడు నేను ఎందుకు ఇక్కడ.. వర్క్ చెయ్యాలి.. నా మాటకి జాబ్ కి వాల్యూ లేనప్పుడు.. నాకు ఈ జాబ్ అవసరం లేదు.. రూల్స్ ప్రకారం వన్ మంత్ ముందు చెప్పాలి ఇప్పుడే చెప్తున్నానని కార్తీక్ అనగానే.. వన్ మంత్ అవసరం లేదు. ఇప్పుడే వెళ్లొచ్చు వెళ్తే ఆపను.. ఉంటే వద్దననని శివన్నారాయణ అనగానే కార్తీక్ హర్ట్ అవుతాడు. టూ మినిట్స్ రాజీనామా లెటర్ తీసుకొని వస్తానని కార్తీక్ వెళ్తాడు.
అప్పుడే దీప క్యారేజ్ పట్టుకొని వస్తుంది. దీప రెండు నిముషాలు తింటూ మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. కార్తీక్ బాబు ఏంటి అలా ఉన్నాడని అడుగగా తాతయ్యతో గొడవ పడి రాజీనామా చేస్తున్నాడని జ్యోత్స్న అనగానే.. కార్తీక్ ని వద్దని రిక్వెస్ట్ చేస్తుంది దీప. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. తాతయ్య గారు అంటూ దీప ఏదో చెప్పబోతుంటే.. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని శివన్నారాయణ అంటాడు. మీ మనవరాలిని అని దీప అనగానే.. దాస్ నిజం చెప్పాడా అని జ్యోత్స్న కంగారుపడుతుంది. మొన్న మిమ్మల్ని పెద్దాయన అంటే తాతయ్య అని పిల్వమన్నారని గుర్తుచేస్తుంది. దీనికి నిజం తెలియదు అని జ్యోత్స్న రిలాక్స్ అవుతుంది. త్వరగా ఈ దీపని లేకుండా చెయ్యాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.