Home  »  TV News  »  Karthika Deepam2 : జ్యోత్స్నతో ఆడుకున్న దాస్.. పారుని ఇరికించిన కార్తీక్!

Updated : Feb 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం-2 (Karthika Deepam2). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-604 లో కాశీ, స్వప్న మాట్లాడుకుంటారు. నన్ను ఈ ఒక్కసారికి అంగీకరించొచ్చు కదా అని కాశీ అడుగుతాడు. పాముకి పాలు పోసి పెంచినా అది తిరిగి కాటే వేస్తుంది. నువ్వు కూడా అంతే నిన్ను క్షమించనని స్వప్న అంటుంది. దాంతో కాశీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకదగ్గర దాస్, జ్యోత్స్న కలుసుకొని మాట్లాడుకుంటారు. నిజం చెప్పేసావా నాన్నా అని జ్యోత్స్న అడుగగా నీకలా అనిపిస్తుందా అమ్మా అని దాస్ అంటాడు. అనిపించడమేంటి కళ్ళ ముందు కనిపిస్తుందని జ్యోత్స్న అంటుంది.  ఏం కనిపిస్తుందని దాస్ అడుగగా..‌దశరథ్ కూతురు దీప అయితే తను ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే చేస్తున్నాడని జ్యోత్స్న అంటుంది. 

మరి వెళ్ళి అన్నయ్యనే అడుగలేకపోయావా అని దాస్ అంటాడు.  నువ్వేమైనా నిజం చెప్పావా అని జ్యోత్స్న అడుగగా అలాగని నీకెవరైనా చెప్పారా అని దాస్ అంటాడు. రిపోర్ట్స్ నేను నమ్మను.. దీప నిజంగా దశరథ్ కూతూరా అని జ్యోత్స్న అనగానే అది నీ‌ ఇష్టం అని దాస్ అంటాడు. మా వదినకి ప్రాణాలు పోసేది నువ్వే అమ్మా అని దశరథ్ అనగానే నాన్న ఇక చాలు అని జ్యోత్స్న అంటుంది. ఇప్పటికే మీరు చాలా పాపాలు చేశారమ్మా  ఇక చాలు ఆపేయండి.. నాకు నీ మీద అనుమానం ఉంది.. దశరథ్ అన్నయ్యని దీప షూట్ చేసిందన్నారు కదా అది నువ్వే చేశావేమో అనిపిస్తుందని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. నువ్వేమంటావని దాస్ అడుగగా.. నీలాంటి దుర్మార్గపు తండ్రి నాకు తప్ప ఇంకెవ్వరికి లేడు అని అంటానని జ్యోత్స్న అంటుంది. మరోవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటారు. ఏం అయింది బావ..నాన్న ఏం అన్నాడని దీప అడుగుతుంది. మామయ్యకి తట్టుకోలేనంత ఆనందం పట్టరానంత బాధ ఉన్నాయి..  ఆ ఎమోషన్ లో ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు.. ఆ ఇంట్లోను అంతే , ఈ ఇంట్లోను అంతే.. నా కూతురు నా కూతురు అని అందరికి చెప్తుంటే అప్పుడే జ్యోత్స్న వచ్చింది. మాములుగానే మేడమ్ కి వంద అనుమానాలు ఉంటాయని కార్తీక్ అక్కడ జరిగింది చెప్తాడు. మా నాన్నని ఏం అనకు బావ అని దీప అనగానే ఏం అనట్లేదు దీప అని కార్తీక్ అంటాడు.

ఇప్పుడు మన ముందు పెద్ద టాస్క్ ఉంది దీప. ఎవరికి తెలియకుండా జ్యోత్స్న స్టానంలో నిన్ను ఉంచి ఆపరేషన్ చేపించడం కార్తీక్ అంటాడు. అవునని దీప అంటుంది. ఆపరేషన్ జరిగేప్పుడు కడుపులోని బిడ్డకి ఏదైనా అయితే ఆ బాధ నుండి తేరుకోవడం అంత తేలిక కాదు దీప అని కార్తీక్ అంటాడు. బిడ్డని వదులుకోవడానికి మాట ఇచ్చావు కదా థాంక్స్ బావ మీకు ఋణపడి ఉంటానని దీప అంటుంది. మాట అయితే ఇచ్చాను కానీ ఆశ అయితే చివరి దాకా ఉంటుందని కార్తీక్ అంటాడు. మరోవైపు దాస్, జ్యోత్స్న మాట్లాడుకునే దగ్గరికి పారిజాతం వస్తుంది. నా కొడుకుని ఏం అంటున్నావే సుమిత్ర కూతురా అని పారిజాతం అంటుంది. నేను కాదు.. నీ మనవరాలిని అని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. నేను నిన్ను నమ్మనని పారిజాతం అంటుంది. ఆ రిపోర్ట్స్ అబద్ధమని నిరూపించడానికి నాకు టైమ్ రావాలని జ్యోత్స్న అంటుంది. శివన్నారాయణ మనవరాలికి నాతో పనేంటి.. మాటలేంటి అని దాస్ అనగానే.. ఇప్పుడు నీ టైమ్ నడుస్తుంది నాన్న అని జ్యోత్స్న అంటుంది. మరుసటి రోజు ఉదయం జ్యోత్స్న , పారిజాతం ఇద్దరు మెడిటేషన్ చేస్తుంటారు. అప్పుడే అక్కడికి కార్తీక్ వచ్చి ఎందుకు మెడిటేషన్ చేస్తున్నావ్ పారు అని అడుగుతాడు.  మనశ్శాంతి కోసం అని పారిజాతం అనగానే ఎందుకు మనశ్శాంతి లేదని కార్తీక్ అడుగుతాడు. కొన్ని చెప్పుకోలేము.. కొన్ని దాచుకోలేము.. కొన్ని ఒప్పుకోలేమని అంటుంది. అవునా ఏంటని కార్తీక్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. పారుకి మనశ్శాంతి పోయిందంట అందుకే మెడిటేషన్ చేస్తుందంట.. ఎందుకని అడిగితే కొన్ని చెప్పుకోలేము.. కొన్ని ఒప్పుకోలేము అంటూ రిథమిక్ గా చెప్పిందని కార్తీక్ అనగానే ఏంటని శివన్నారాయణ అడుగుతాడు. దాంతో పారిజాతం షాక్ అవుతుంది. టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.