![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -664 లో......జ్యోత్స్న రాత్రి బయటకు వెళ్తుంది. అక్కడ క్యాబ్ కోసం సూరజ్ వెయిట్ చేస్తాడు. ఛీ అసలు క్యాబ్ బుక్ అవడం లేదేంటని చిరాకుపడతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న జ్యోత్స్న తనని చూసి గిఫ్ట్ షాప్ లో జరిగింది గుర్తుచేసుకొని వీడికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది. తన ముందు కార్ ఆపుతుంది. మీరు గిఫ్ట్ షాప్ లో నాతో గొడవ పడ్డ అతను కదా ఏంటి ఇక్కడ ఉన్నారని అడుగుతుంది. క్యాబ్ బుక్ అవడం లేదని సూరజ్ అంటాడు. మీరు ఎక్కడికి వెళ్తున్నారని జ్యోత్స్న అడుగుతుంది. మణికొండ అని సూరజ్ అనగానే నేను అక్కడికే వెళ్తున్నానని జ్యోత్స్న అంటుంది. నేను రాను.. మీకు ఏమవుతాను.. మీరు నాకు ఏమవుతారని సూరజ్ అంటాడు.
క్యాబ్ అనుకోండి అని జ్యోత్స్న అంటుంది. అయితే డబ్బు తీసుకుంటారా అని సూరజ్ అంటాడు. సరే తీసుకుంటానని జ్యోత్స్న అనగానే సూరజ్ కార్ ఎక్కుతాడు. మరొకవైపు దీప, కార్తీక్ కోసం కాంచన, శ్రీధర్ వెయిట్ చేస్తారు. వాళ్ళు రాగానే మీరు ఇంకా ఎన్ని రోజులు ఆ ఇంట్లో పనులు చేస్తారు.. మీరు జ్యోత్స్న పెళ్లి తర్వాత ఆ ఇంటికి వెళ్లనని మాటివ్వండి అని కాంచన అనగానే దీప మాటిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ మాటిస్తాడు.ఆ తర్వాత జ్యోత్స్న కావాలనే ఎవరు లేని చోటుకి వెళ్తుంది. ఏంటి ఇటుగా వెళ్తే మణికొండ వస్తుందా అని సూరజ్ అంటాడు. అయ్యో మీరు మణికొండ అన్నారా.. నాకు వేరే వినిపించింది.. సారీ మీరు వెళ్ళండి అని దింపేస్తుంది. దాంతో సూరజ్ తనతో కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. నాతోనే పెట్టుకుంటాడా అని జ్యోత్స్న అనుకొని కార్ లోకి వస్తుంది చూసేసరికి కార్ కి కీ(తాళం), ఫోన్ రెండు ఉండవు.. ఏం దెబ్బ కొట్టావ్ రా.. నిన్ను చీట్ చేద్దాం అనుకుంటే నన్ను చీట్ చేసావని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక చేసేదేమీ లేక నడుచుకుంటూ వెళ్తుంది.
ఆ తర్వాత నువ్వు మాటిచ్చావ్ కాబట్టే నేను ఇచ్చానని దీపతో కార్తీక్ అంటాడు. నువ్వు మా అమ్మ గురించి ఆలోచించావ్ కాబట్టి నేను కుడా మీ అమ్మ గురించి ఆలోచించాలి కదా అని దీప అంటుంది. మరొకవైపు జ్యోత్స్న నడుచుకుంటూ వెళ్తుంటే ఆటో వస్తుంది. ఆటో ఆపుతుంది.. మా సర్ ఒప్పుకుంటే ఎక్కించుకుంటానని ఆటో డ్రైవర్ అంటాడు. లోపల చూస్తే సూరజ్ ఉంటాడు. నువ్వు ఎంత చీట్ చేసావని జ్యోత్స్న అంటుంది. ఎక్కుతావా ఎక్కవా అని సూరజ్ అనగానే వేరే దారి లేక జ్యోత్స్న ఎక్కుతుంది. మరొకవైపు జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదని సుమిత్ర వాళ్ళు టెన్షన్ పడతారు. కార్తీక్ కి ఫోన్ చేసి జ్యోత్స్న ఏమైనా అక్కడికి వచ్చిందా అని అడుగుతారు. లేదని కార్తీక్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |