![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -268 లో ..గంగ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే అలా కాదని విశ్వ కోప్పడతాడు. అయినా అలాగే చేస్తుంటే అలా కాదు ఇలా అని దగ్గర ఉండి చూపిస్తాడు. ఆ విషయం రంగా వెళ్లి రుద్రకి చెప్తాడు. గంగకి ప్రాక్టీస్ చేయిస్తున్నాడా అని రుద్ర ఆశ్చర్యంగా చూడడానికి వస్తాడు. అప్పుడే గంగ, విశ్వ దగ్గరికి ధీరజ్ వచ్చి సర్ మీరు తనకి నేర్పిస్తున్నారేంటి.. డబ్బు నేను ఇస్తున్నాను.. అలాంటి వాళ్ళకి నేర్పిస్తే మీ పేరు దెబ్బ తింటుంది.. నాలాంటి వాళ్ళని గెలిపిస్తే మీకు పేరు వస్తుంది.. స్పాన్సర్స్ వస్తారు అని ధీరజ్ పొగరుగా అంటాడు. నువ్వు పొసెసివ్ గా ఫీల్ అవుతున్నావని అర్థమైందని విశ్వ అంటాడు. ఆ తర్వాత ధీరజ్, విశ్వ పక్కకి వచ్చాక తన చెంప చెల్లుమనిపిస్తాడు విశ్వ. ఏం మాట్లాడావ్ వాళ్ళ ముందు.. ఎందుకని ఆగానంటే.. నువ్వు ఇచ్చే ఫీజు నా కార్ మెయింటైన్స్ కుడా చాలదని ధీరజ్ పై విశ్వ కోప్పడతాడు.
సారీ సర్ అని ధీరజ్ చెప్తాడు. ఆ తర్వాత శకుంతల తన తమ్ముడు ఫోటో పట్టుకొని బాధపడుతుంది. ఆ రోజు మీ చెల్లి నాకు పెళ్లి ఇష్టం లేదని చెప్తే ఇంత దూరం వచ్చేది కాదని పెద్దసారుతో శకుంతల చెప్తుంది. అప్పుడే స్నేహ వచ్చి పెద్దనాన్న రుద్ర అన్నయ్యతో సూర్య కోపంగా మాట్లాడాడని జరిగింది మొత్తం చెప్తుంది. దాంతో పెద్దసారు సూర్య దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ఆఫీస్ కి వెళ్లి నెల కూడా కాలేదు అప్పుడే అలా తయారు అయ్యావా అని కోప్పడతాడు. నేనేం అన్నాను మాది మేం చూసుకుంటాం అన్నానని సూర్య అనగానే పెద్దసారు కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు ఇషిక రెడీ అవుతుంది అప్పుడే తన దగ్గరికి ఇందుమతి వస్తుంది. ఎక్కడికి రెడీ అవుతున్నావ్.. నాకు కాఫీ తీసుకొని రా అని ఇందుమతి అంటుంది. నేను తీసుకొని రాను.. ఖాళీ ఉన్నవాళ్లు ఇంట్లో పనులు చేసుకోండి.. నేను ఆఫీస్ కి వెళ్తున్నానని ఇషిక అనగానే ఇందుమతి కోపంగా సూర్య దగ్గరికి వస్తుంది. ఒరేయ్ నీ భార్య నాతో ఇలా మాట్లాడుతుందని చెప్తుంది. నేనే తనని ఆఫీస్ కి రమ్మని చెప్పానని సూర్య అనగానే అందరు షాక్ అవుతారు.
ఇంట్లో చదువుకోని వాళ్ళే బిజినెస్ బాక్సింగ్ అంటూ తిరుగుతున్నారు. అలాంటిది నా భార్య చదువుకుంది.. అందుకే బిజినెస్ లో నాకు తోడుగా ఉంటుందని నిర్ణయం తీసుకున్నానని సూర్య అంటాడు. తీసుకున్నావ్ కానీ మాకు ఒక మాట చెప్పాలి కదా అని పెద్దసారు అంటాడు. పెద్దసారు, శకుంతల దగ్గర ఇషిక ఆశీర్వాదం తీసుకుంటుంది. వీరు దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది. అదంతా చూస్తూ కూడా రుద్ర సైలెంట్ గా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |