Home  »  TV News  »  Illu illalu pillalu: గుడిలో ఊహించని హైడ్రామా.. భర్త పేరు చెప్పనన్న ప్రేమ!

Updated : Aug 11, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-546 లో..  విశ్వ, అమూల్య ఇద్దరు ఒక ప్లాన్ చేస్తారు. రాత్రి ధీరజ్ తనను ఎగతాళి చేశాడని ప్రేమను రెచ్చగొడతాడు విశ్వ. గుడిలో ధీరజ్ ను చూడగానే నువ్వు ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుంటావు, మళ్లీ ప్రేమలో పడతావని విశ్వ అబద్ధాలు చెప్పి ప్రేమని రెచ్చగొడతాడు. దీంతో ప్రేమ రెచ్చిపోతుంది. వాడి భ్రమ అని తెలిసేలా చేస్తా అని గుడికి రావడానికి ప్రేమ ఒప్పుకుంటుంది. ఫస్ట్ స్టెప్ సక్సెస్ అని విశ్వ తన మనసులో అనుకుంటాడు. ఇక గుడిలో భద్రవతి ఫ్యామిలీ, రామరాజు ఫ్యామిలీలు ఎదురుపడతాయి. ప్రేమ , ధీరజ్ ని చూసి పొగరుగా మొహం తిప్పుకుంటుంది, ధీరజ్ కూడా.. ఈ కటింగ్స్ చూడలేకపోతున్నానని అనుకుంటాడు.
 
దొంగపెళ్లిళ్ల బిజినెస్ అంటూ రామరాజు ఫ్యామిలీని సేనాపతి అవమానిస్తాడు. దాంతో రామరాజు, శారదాంబ అడ్డుకుంటారు. ఇక్కడే విశ్వ కావాలని ప్రేమ మీద పడటంతో ప్రేమ డైరెక్ట్ గా ధీరజ్ చేతుల్లో పడిపోతుంది.  అప్పుడే మొగుడికి దూరంగా ఉండలేక పడిపోయిందని ప్రేమని నర్మద ఆటపట్టిస్తుంది. అదే సమయంలో వల్లి భద్రవతిని పక్కకు తీసుకెళ్లి.. వీళ్లు గుడికి వచ్చింది పట్టుచీరల కోసం కాదు, ధీరజ్-ప్రేమలను కలపడానికి అని  చెప్తుంది. దాంతో భద్రవతి కోపంగా ఉంటుంది. మనం కొత్త ప్లాన్ చేయొద్దు, ప్రేమను వాళ్లతో ఒంటరిగా మాట్లాడనివ్వకుండా ఉంటే చాలు, వాళ్ల ప్లాన్ బుడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఇద్దరు అనుకుంటారు.


మరోవైపు ప్రేమతో మాట్లాడడానికి వేదవతి సైగతో నర్మద దగ్గరకు వెళ్తుంది. కానీ అప్పుడే భద్రవతి పరుగెత్తుకుంటూ వచ్చి అడ్డుకుంటుంది. నువ్వు అటువైపు ఉండాలని నర్మదతో భద్రవతి అంటుంది. అంటే ఇది మీ ఇల్లా? దేవుడు మీరు రాసిచ్చారా అని నర్మద గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ప్రేమ మధ్యలో వచ్చి.. అక్కను ఏమీ అనొద్దు అత్తా అని సపోర్ట్ చేస్తుంది. చివర్లో పంతులు అర్చన కోసం భర్త పేరు అడిగితే.. నా ఒక్కదాని పేరు మీదనే చేయించండి అని ప్రేమ క్లియర్ గా చెప్పేస్తుంది. భర్త పేరు చెప్పకపోవడం అశుభం అన్నా వినదు. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.