Home  »  TV News  »  లవ్ బర్డ్స్ మధ్య హీరో నవదీప్!

Updated : May 11, 2026

హీరో నవదీప్ ఏది ఒకటి  సంథింగ్ డిఫరెంట్ గా చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాడు. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో అలా చిన్న రీల్ పోస్ట్ చేసాడు . ఒక బ్రిడ్జ్ మీద కూర్చుని చేతిలో కొన్ని గింజలు ఉన్న ప్లేట్ ని పెట్టుకొనేసరికి అతని చేతి మీదకు రంగు రంగుల లవ్ బర్డ్స్ అన్నీ  వచ్చి వాలి అవి తినడం మొదలుపెట్టాయి. అంతే కాదు  దానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ లో భారతీయుడు మూవీలోని "పచ్చని చిలుకలు తోడుంటే" అనే సాంగ్ పెట్టుకున్నాడు. ఇక కింద  జిమ్ క్యారీ కాప్షన్ పెట్టుకున్నాడు. “ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలి, ప్రసిద్ధులు కావాలి, వాళ్లు కలలు కన్న ప్రతిదీ సాధించాలి. అప్పుడు మాత్రమే అది జీవితానికి అసలు సమాధానం కాదని వారికి తెలుస్తుంది.” అనేది దాని సారాంశం . ఐతే అసలు అర్ధం ఏంటంటే డబ్బుంటే  సమస్యలన్నీ తీరిపోతాయి అని పేరొస్తే  సంతోషంగా ఉంటామని విజయం సాధిస్తే జీవితానికి అర్థం దొరుకుతుంది అని అర్ధం కాదు.  జీవితానికి నిజమైన సంతృప్తి కేవలం వాటిలోనే ఉండదని జిమ్ ఉద్దేశం. జిమ్ ఒక కెనడియన్ అమెరికన్ నటుడు, కమెడియన్. అతని ముఖం ఎలాస్టిక్ లా సాగుతూ ఉంటుంది. అతను ఒక స్టాండప్ కమెడియన్ గా తర్వాత నటుడిగా ఎదిగారు. ఇక నవదీప్ ఆయన కామెంట్ ని ఇలా తన రీల్ కి షేర్ చేయడం అంటే గొప్ప విషయం.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.