"ఆనందం" మూవీ హీరో ఆకాష్ గుర్తున్నాడా..మొదటి సినిమాతోనే బిగ్ హిట్ అందుకుని మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆకాష్ తో మూవీస్ చేయడానికి డైరెక్టర్స్ పోటీ పడ్డారు. కానీ ఆకాష్ మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అలా ఫేడ్ అవుట్ ఐపోయిన ఆకాష్ చాలా ఏళ్ళ తర్వాత బుల్లి తెర మీద కనిపించబోతున్నాడు.
త్వరలో జెమినీ టీవీలో ఒక సీరియల్ ద్వారా అరంగేట్రం చేయబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ లో ఆయన పోస్ట్ చేసిన పిక్స్ చూస్తే అర్ధమవుతుంది. ఈ పిక్స్ లో ఆకాష్ తో పాటు సహనటులు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. ఆకాష్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. "బెంగళూరులో నా కొత్త సీరియల్ షూటింగ్" అంటూ సన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోస్ పోస్ట్ చేసాడు. ఐతే సీరియల్ ఏమిటి అందులో ఆకాష్ పాత్ర ఏమిటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆకాష్ రెండు తమిళ డైలీ సీరియల్స్ "నీతానే ఎన్ పొన్వసంతం" " తవమై తవమిరుండు" లో నటించాడు. అలాగే ఆయన నటించిన కన్నడ సీరియల్ ‘జోతాయి.. జోతాయల్లీ’ అక్కడి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. 2010 లో "నమో వేంకటేశ" మూవీలో నటించాడు.. ఆ తర్వాత ఎక్కడా కనిపించని ఆకాష్ ఇప్పుడు ఇప్పుడు కొత్త సీరియల్ ద్వారా తెలుగు టీవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు. శ్రీలంకలో పుట్టిన ఆకాశ్.. లండన్ లో సెటిల్ అయ్యాడు.
తర్వాత వాళ్ళ ఫామిలీ తమిళనాడుకు వచ్చేసింది. అలా శ్రీలంకన్ తమిళియన్‌గా ఆకాశ్‌కు పేరుంది. ఆనందం తర్వాత తెలుగులో పిలిస్తే పలుకుతా, నీతో చెప్పాలని, వసంతం, ఆనందమానందమాయే, అందాల రాముడు, నవ వసంతం, ఢీ, నమో వెంకటేశ లాంటి చాలా సినిమాలు చేసారు ఆకాష్. ఆయన పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో పుట్టారు. ఇక ఆకాష్ కు శ్రీలంకలో టీ పౌడర్ బిజినెస్ కూడా ఉంది. ఆకాష్ కె. బాలచందర్ నిర్మించిన "రోజావనం" మూవీలో సెకండ్ లీడ్ రోల్ లో చేసాడు. అప్పటినుంచి అతను తన పేరును జై ఆకాష్ గా పెట్టుకున్నాడు.