![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -03 లో..... జానూ కర్రసాము పోటీలో గెలిచి తన తండ్రి ఆశని తీర్చాలని అనుకుంటుంది. ఆడవాళ్లు ఈ పోటీలో పాల్గొంటారా అని భువన తక్కువ చేసి మాట్లాడుతుంటే తనకి స్ట్రాంగ్ గా సమాధానం చెప్తుంది జానూ. మరొకవైపు శంకర్ ని చూసి వాళ్ళ అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య బాగున్నారా అంటూ మురళి తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.
ఆ తర్వాత కర్రసాము పోటీ మొదలు అవుతుంది. జానూకి కళ్ళకి గంతలు కడుతారు. శంకర్ కుటుంబం మొత్తం వచ్చి పోటీని చూస్తారు. మురళి అందరికి జ్యూస్ తీసుకొని వచ్చి ఇస్తాడు. గౌతమి జ్యూస్ తాగుతూ సింహాద్రి కొడుకుతో నీకు కావాలా అంటూ అడుగుతుంది. జానూ పోటీలో గెలుస్తుంది కళ్ళకి ఉన్న గంతలు తీసి వాళ్ళ నాన్న శంకర్ మొహం చూస్తుంది. తండ్రి కూతుళ్లు చాలా రోజుల తర్వాత చూసుకునేసరికి ఎమోషనల్ అవుతారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ గెలిస్తే ఏంటి.. నేను గెలిస్తే ఏంటని సింహాద్రి హ్యాపీగా ఫీల్ అవుతాడు. జానూకి భువన ప్రైజ్ ఇవ్వబోతుంటే మా నాన్న చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవాలని ఉందని జానూ అనగానే భువన అక్కడ నుండి కోపంగా వెళ్తుంది. శంకర్ చేతులు మీదుగా ప్రైజ్ తీసుకుంటుంది.
ఆ తర్వాత భువన కోపంగా సూర్యని తీసుకొని కార్ దగ్గరికి వెళ్తుంది. కళ్యాణం చూసి వస్తానని సూర్య అంటాడు. మీ మామయ్య కాదు కళ్యాణ్ జరిపించేది అని భువన అంటుంది. అయితే ఏంటి పెళ్లి కాని వాళ్ళు దేవుడి కళ్యాణం చూస్తే పెళ్లి అవుతుంది అంట అని సూర్య అనగానే సరే నువ్వు చూసి రా అని భువన అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత జానూ పోటీలో గెలిచింది కాబట్టి సీతారాముల కళ్యాణం వాళ్ళ కుటుంబం చేతుల మీదుగా జరుగుతుంది. తరువాయి భాగంలో ఆంజనేయస్వామికి శంకర్ కుటుంబం అభిషేకం చేస్తారు. తన కూతురు తన ఆశని నెరవేర్చినందుకు శంకర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |