Home  »  TV News  »  నవదీప్ కి ఐ లవ్ యు చెప్పిన కంటెస్టెంట్... ఈ బిట్ కట్ చేసి వేయండి

Updated : Aug 12, 2026

బిగ్ బాస్ అగ్నిపరీక్ష సందడి మొదలైపోయింది. మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక ప్రోమోస్ మీద ప్రోమోస్ రిలీజ్ అవుతున్నాయి. 3 పవర్ హౌసెస్ గా అభిజిత్, నవదీప్, బిందు మాధవి వచ్చారు. అలాగే 70 మంది అగ్ని వారియర్స్ అంటూ కూడా వచ్చారు. "కెమెరా ముందు వీళ్లకు ఫైర్ ఉండబోతోంది కెమెరా వెనక ఆడియన్స్ కి ఫన్ ఉండబోతోంది " అని అభిజిత్ చెప్పాడు.

ఇక ఇందులో ఒక కండల కుర్రోడు వచ్చాడు. "ఏంటి మీ టాలెంట్స్ " అని నవదీప్ అనగానే టీ షర్ట్ తీసేసి కండలు చూపించాడు. " మై గాడ్ " అంది శ్రీముఖి. "హ్యాపీ నా శ్రీముఖి " అంటూ నవదీప్ అనేసరికి నవ్వేసింది. వెయిట్ ఏదన్నా పెడితే పుషప్స్ తీస్తానన్నాడు. శ్రీముఖిని వెయిట్ లా పెట్టనా నీ పైన అంటూ నవదీప్ ఫన్ చేసాడు. ఇక ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చింది. "ఎవరు లేనప్పుడు ఫోన్ లో ఎం చూస్తుంటావ్ " అన్నాడు నవదీప్. "అందరూ చూసేవే చూస్తుంటాను " అని చెప్పింది.

వ్యవసాయం చేసే ఒక లేడీ కంటెస్టెంట్ వచ్చింది. "పొలం పనులు చేస్తూ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నా. నాన్నకు ఆసరాగా ఉంటున్న " అని చెప్పింది. వెంటనే బిందు మాధవి. "జాబ్ వస్తే వ్యవసాయం మానేస్తావా" అని అడిగింది. "హౌస్ లో ఎలా ఉంటావ్ మరి " అని శ్రీముఖి అడిగింది. "ఏదన్నా టాస్క్ ఇవ్వండి . అందులో ఓడిపోతే వీక్ అని నేను అనుకుంటాను " అంటూ చెప్పింది ఆ కంటెస్టెంట్. ఇక నవదీప్ గ్రీన్ ఇచ్చి నీలాంటి కథలు బయటకు వెళ్ళాలి అని చెప్పాడు. లాస్ట్ సీజన్ లో కూడా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక మరో కంటెస్టెంట్ రివర్స్ తెలుగు రైటింగ్ అనే స్పెషల్ టాలెంట్ తో వచ్చింది. నవదీప్ వెళ్లి మరి ఆమెను వెంటబెట్టుకుని వచ్చాడు. "చందమామ సినిమాలో నా చందమామ నవదీప్ గారు. ఐ లవ్ యు సర్  " అని రాసి దాన్ని చదివింది. ఇక శ్రీముఖి గట్టిగా అరుస్తూ నవ్వేసరికి నవదీప్ కూడా ఐ లవ్ యు చెప్పేసాడు. "సర్ నాకు కూడా ఐ లవ్ యు చెప్పారు ఆ బిట్ కట్ చేసి వేయండి " అంటూ ఆ కంటెస్టెంట్ కూడా మంచి హుషారుగా డైలాగ్ చెప్పింది. దాంతో నవదీప్ కూడా నవ్వేసాడు. ఇక మరో లేడీ కంటెస్టెంట్ రెండు చేతుల్లో రెండు కుండలు పట్టుకుని వచ్చి " ఆ తర్వాత ఐఐటి జెఈఈ " అని చెప్పింది. "మన బ్యాచే " అన్నాడు నవదీప్ . "మీరు రాశారా " అంది "రాసాను " అన్నాడు "నేను రాయలేదు " అని చెప్పింది.దాంతో నవదీప్ పడీపడీ నవ్వేసాడు. ఇక అభిజిత్ ఐతే గ్రీన్ ఇచ్చేసాడు. ఆల్రెడీ ఇద్దరు లేడీస్ జడ్జెస్ గ్రీన్స్ ఇచ్చేసి సెలెక్ట్ చేశారు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.