స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -779 లో ... రిషి గురించి అలోచిస్తుంది వసుధార. చక్రపాణి వచ్చిన పట్టించుకోకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. వసు అని చక్రపాణి పిలవగానే ఒక్కసారిగా ఆలోచనల నుండి బయటకు వచ్చి.. ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వేరే దగ్గరకు వెళ్లి రిషి పరిచయం అయిన దగ్గర నుండి తనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటుంది.
వసుధార దగ్గరికి చక్రపాణి వచ్చి.. ఎన్ని రోజులు ఇలా ఆలోచిస్తూ బాధపడుతుంటావ్? ఎప్పటికైనా రిషి సర్ నీ దగ్గరికి వస్తాడు. ఎప్పటిలాగే రిషి సర్ జగతి మేడం అందరు హ్యాపీగా ఉంటారని చక్రపాణి అంటాడు. లేదు నాన్న రిషి సర్ వెళ్తు వెళ్తు జగతి మేడంని అమ్మ అని పిలిచాడు. జీవితంలో మీకు నేను అమ్మ అని పిలువలేదు అనే బెంగ ఉండద్దంటూ చెప్పాడు. అప్పుడే అర్థం అయింది రిషి సర్ మా దగ్గరికి మళ్ళీ రాడని.. రిషి సర్ ని మోసం చేసాం. ఆ మోసాన్ని ఎప్పుడు క్షమించడని వసుధార అంటుంది. అప్పుడే వసుధారకి అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది. నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేక ఈ కాలేజీలో చదువు చెప్పడానికి వెళ్తావని నేనే అప్లై చేశానని వసుధారతో చక్రపాణి అంటాడు. ఎందుకు ఇలా చేశారు నాన్న అని వసుధార అంటుంది. కానీ వసుధార కాలేజీకి వెళ్ళడానికి చక్రపాణి ఒప్పిస్తాడు. ఆ తర్వాత వసు దగ్గర ఉన్న ఒక అమ్మాయి.. తను వెళ్లే కాలేజీ గురించి చెప్తుంది. ఆ కాలేజీ స్టూడెంట్స్ తో జాగ్రత్త.. వాళ్ళు లెక్చరర్స్ ని ఒక అట ఆడుకుంటారట అని వసుధారతో ఆ అమ్మాయి చెప్తుంది. మరొకవైపు రిషి గురించి జగతి ఆలోచిస్తుంది. ధరణి వచ్చి.. ఏంటీ చిన్నత్తయ్య.. ఎప్పుడు ఇలాగే బాధపడుతూనే ఉంటారా అని అడుగుతుంది. జగతి మౌనంగా ఉంటుంది. అయితే తన వల్లే రిషి వెళ్ళాడని.. ఎవరు తనతో మాట్లాడడం లేదు. చివరికి మహేంద్ర కూడా జగతితో మాట్లాడడానికి ఇష్టపడటం లేదు.
మరొకవైపు వసుధార కాలేజీకి వెళ్తుంది. ఎప్పుడు స్టూడెంట్ గా వెళ్ళిన వసుధార మొదటి సారిగా.. చీరకట్టుతో లెక్చరర్ హోదాలో వెళ్తుంది. వసుధార క్లాస్ కి వెళ్ళి స్టూడెంట్స్ తో మాట్లాడుతుంది. వేరొక లెక్చరర్ వచ్చి ఈ పీరియడ్ నాది మీరెలా తీసుకుంటారు. లెక్చరర్ అయి ఉండి మీ పీరియడ్ టైంకి రావాలని తెలియదా అంటూ ఆ లెక్చరర్ అనేసరికి వసుధార కోపంగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి.. నన్ను ఆ క్లాస్ కి ఎందుకు పంపించారంటూ అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.