స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్ - 675 లోకి అడుగుపెట్టింది. బుల్లితెరపై రిషి, వసుధారల ప్రేమకు విశేషమైన స్పందన వస్తోంది. కాగా బుధవారం నాటి ఎపిసోడ్‌లో... వసుధారని తల్చుకుంటూ ఆలోచనల్లో మునిగిపోతాడు రిషి.
నా ఆలోచనల్ని.. కలల్ని మాయం చేశావ్. నన్ను వదిలేసి వెళ్ళిపోయావ్. నేనేం నేరం చేశాను. నా తప్పేముంది అని అనుకుంటూ రిషి బాధపడుతుంటాడు. అంతలో రిషి దగ్గరికి జగతి అన్నం తీసుకొని వచ్చి తినమని ఇస్తుంది. నేను తినను అని రిషి చెప్తాడు. "వసుధారని ఎలా మర్చిపోవాలో చెప్తారా మేడం.. మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నానంటే మొదటగా వసుధారని ప్రేమిస్తున్నానని నాక్కూడా తెలియని విషయాన్ని నాకు చెప్పారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను" అని అంటాడు. జీవితం అంటేనే పోరాటం కాలమే అన్నింటికి సమాధానం చెప్తుందని చెప్పి అక్కడి నుండి జగతి వెళ్ళిపోయింది. రిషి రెడీ అయి బయటకు వెళ్తుండగా... మేం కూడా వస్తామని జగతి, మహేంద్ర అంటారు. సరే అని అన్నాక అందరూ వెళ్తారు.
నాన్న మిమ్మల్ని ఒక ప్లేస్ కి తీసుకొని వెళ్తానని చక్రపాణితో చెప్తుంది వసుధార. ఇద్దరు కలిసి ఒక చెరువు ఒడ్డుకి వెళ్తారు. "నాన్నా... ఈ గంగ ఒడ్డున మనం కోరికలు రాసి నీటిలో వదిలితే మన కోరికలు తీరుతాయట అమ్మ చెప్పింది" అని వసుధార అనగానే.. సరే నువ్వు వెళ్ళు అమ్మా అని చక్రపాణి అంటాడు. "రిషి సర్ నేను రిషిధారగా ఒక్కటవ్వాలి" అని పేపర్ పడవ మీద రాసి పంచభూతాలకు మొక్కుకొని నీటిలో వదులుతుంది. మరోవైపు రిషి అటువైపుగా వచ్చి.. "నా ప్రపంచమే వసుధార. ఆమె ఏం కోరుకుంటే అది జరగాలి" అని రాసి కాగితపు పడవను నీటిలో వదులుతాడు. ఆ తర్వాత రెండు పడవలు కలుసుకోవడంతో ఆ పడవ ఎవరిది అని ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.అలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోతారు. ఈ సీన్ అంతా ఎమోషనల్ గా సాగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.