స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మమూడి'(Brahmamudi ). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -553 లో....రాజ్ ఖాళీగా ఉన్నాడంటూ ఇంట్లో అందరు అంటుంటారు.. నువ్వు కావ్యకి భయపడి వెళ్ళట్లేదు.. అంతే కాకుండా బయట అందరు రాజ్ కి సామర్ధ్యం లేదా అందుకేనా మీ కోడలికి బాధ్యతలు అప్పజెప్పారని అంటున్నారంటూ రాజ్ తో ప్రకాశ్ అంటాడు. ఇలా అందరూ ఒక్కొక్క మాట అనేసరికి రాజ్ ఇగో హర్ట్ అవుతుంది. సరే ఆఫీస్ కి వెళ్తానని అనగానే.. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు..అదంతా పై నుండి రాహుల్ చూస్తాడు. వెంటనే రుద్రాణి దగ్గరికి వెళ్తాడు.
రాజ్ ఇగో హర్ట్ చేసి ఆఫీస్ కి వెళ్ళడానికి ఒప్పుకునేలా చేశారని చెప్పగానే.. మొన్నటి నుండి ప్లాన్ చేసి నడిపించేది ఇదా అని రుద్రాణి అంటుంది. ముందు ఆ మేనేజర్ కి ఫోన్ చెయ్ అని రుద్రాణి అనగానే రాహుల్ ఫోన్ చేస్తాడు. నేను చెప్పేది విను అని రాహుల్ మేనేజర్ కి ఫోన్ చేసి అంటాడు. మీరే నేను చెప్పేది వినండి అని మేనేజర్ తనని సెక్యూరిటీ చేసిన విషయం చెప్పగానే రాహుల్, రుద్రాణి షాక్ అవుతారు. ఇక నేను చూసుకుంటానని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ ఆఫీస్ కి వచ్చి సెక్యూరిటీని చూసి నిన్ను ఇలా చేసింది ఏంటి అడుగుదాం పద అంటూ కావ్య దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కావ్య లాజిక్ మాట్లాడగానే.. నువ్వు వెళ్ళిపోమంటూ సెక్యూరిటీని పంపిస్తాడు రాజ్. ఆ తర్వాత మీటింగ్ జరుగుతుంది. అందులో మీరు ఎంత కాలం సీఈఓ గా ఉంటారో తెలియదు.. మిమ్మల్ని నమ్మి మేమ్ పెట్టుబడి పెట్టలేమని ఇమ్వెస్టర్స్ వెళ్ళిపోతారు. చూసావ్ కదా నీ స్థానం అది.. ఇంట్లో వాళ్లకు కూడా తెలుస్తుందని రాజ్ అంటాడు.
ఆ తర్వాత కావ్య దగ్గరికి అరవింద్ వస్తాడు. తన కంపెనీ అప్పుల్లో ఉందని వేళం వేస్తున్నారు. మీరు తీసుకోండి అని చెప్తాడు. అలా ఎందుకు మీ కంపెనీ కి లాభం వచ్చేలా చేస్తాను.. ఫిఫ్టీ ఫిఫ్డీ లాభం అని కావ్య డీల్ కుదుర్చుకుంటుంది. తరువాయి భాగం లో రుద్రాణి పొగరు అనన్చాలని అనుకున్నావ్ కదా.. ఇప్పుడు ఛాన్స్ వచ్చిందని స్వప్నకి కావ్య ఫోన్ చేసి ఏదో ప్లాన్ చెప్తుంది. ఆ తర్వాత నష్టాల్లో ఉన్న కంపెనీని వేళంలో కొనడానికి రెడీ అయిందని సీతారామయ్యతో రాజ్ చెప్పగానే.. కావ్య అలోచించి చేస్తుంది తనపై నమ్మకం ఉందని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.