స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -597 లో..... దుగ్గిరాల ఇంటికి బ్యాంకు ఆఫీసర్స్ వచ్చినట్లు ఆస్తులు జాప్తు చేస్తామనగానే ధాన్యలక్ష్మి, రుద్రాణి లు కేసు వేస్తామని అనడంతో ఇందిరాదేవి కిందపడిపోయినట్లు రాజ్ కల కంటాడు. దాంతో ఒక్కసారిగా నిద్ర లేచి అలా జరగకూడదు లోన్ తీసుకొని ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చెయ్యాలని రాజ్ తనకి తెలిసిన బ్యాంక్ ఎంప్లాయికి ఫోన్ చెయ్యగా.. ఇస్తాం, కానీ ఆస్తులు ఎవరి పేరున ఉన్నాయో వాళ్ళని తీసుకొని రండీ అనగానే రాజ్ సరే అంటాడు. ఇప్పుడు కావ్యని బ్రతిమిలాడాలని రాజ్ అనుకుంటాడు.
అప్పుడే తన అంతరాత్మ వచ్చి.. ఇన్ని రోజులు కావ్య పైన కోప్పడావు ఇప్పుడడలా అడుగుతావంటూ అనగానే.. ఎప్పుడు ఇలా కరెక్ట్ టైమ్ కి వస్తావని రాజ్ కోప్పడతాడు. మరొక వైపు సీతారామయ్య దగ్గరికి డాక్టర్ వస్తాడు. ఎప్పుడు మా తాతయ్య బాగవతాడని కళ్యాణ్ అనగానే.. ఎప్పుడు కోమాలో నుండి బయటకు వస్తాడో చెప్పలేమని డాక్టర్ అంటాడు. ఆ తర్వాత సీతారామయ్య గురించి కళ్యాణ్ దేవుడికి మొక్కుకుంటాడు. ఆ తర్వాత అందరు భోజనం చేస్తుంటే కూరలో ఉప్పు తక్కువైందంటూ కావ్య పైన రుద్రాణి కోప్పడుతుంది. అపుడే రాజ్ వచ్చి.. ఎన్నడు లేని విధంగా కావ్య ఆకలి అవుతుంది మంచి వాసన వస్తుందంటూ పొగుడుతాడు. భోజనం తిన్నాక అయ్యో ఈ రోజే చప్పగా ఉండాలా అని మనసులో అనుకుంటాడు రాజ్. బయటకు బాగున్నాయి వంటలు అని రాజ్ చెప్పగానే.. ఆస్తులన్నీ కావ్య పేరు వున్నాయ్ కదా అందుకే రాజ్ వంటలు బాలేకపోయిన బాగున్నాయంటూ చెప్తున్నాడని రుద్రాణి అంటుంది.
దాంతో రాజ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మీరే తినండి అంటూ కావ్య కోప్పడుతుంది. మరొకవైపు కళ్యాణ్ కి అప్పు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడుతుంది. నిన్ను అవమానించిన వాళ్లు.. నిన్ను గొప్పగా చెప్పుకోవడానికి ఏంత కష్టమైనా ఇష్టంగా చేస్తున్నానంటూ అప్పు అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ హెల్ప్ చేస్తుంటాడు. ఎన్నడూ లేనిది రాజ్ నీపై ప్రేమ చూపిస్తున్నాడని కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత నీకు ఒక విషయం చెప్పాలని కావ్య చేతులు పట్టుకుంటాడు రాజ్. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.