![]() |
![]() |

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ రోజుకో ట్విస్ట్ తో సరికొత్తగా అలరిస్తోంది. అయితే బుధవారం జరిగిన ఎపిసోడ్ లో కృష్ణ ఒక బ్యాగ్ తీసుకోని ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది. "ఈ కృష్ణ ఏంటి.. ఎవరికి చెప్పకుండా ఎందుకు బయటకు వెళ్ళింది" అని ముకుంద అంటుంది. ఆ తర్వాత నందు కింద పడిపోయి "కృష్ణ .. కృష్ణ" అని అనుకుంటూ ఫిట్స్ వచ్చినట్టు చేస్తుంటుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరు నందు దగ్గరికి వస్తారు. ఇక భవాని " ఏమైంది నందుకి.. ఎందుకిలా చేస్తుంది. కృష్ణ ఎక్కడికి వెళ్ళింది" అని అడుగుతుంది. "కృష్ణ ఆటోలో వెళ్ళడం నేను చూసాను అత్తయ్య " అని చెప్తుంది ముకుంద. "బుద్ది ఉందా.. ఈ అడవిపిల్లకి. ఎవ్వరికి చెప్పకుండా ఎందుకు వెళ్ళింది" అని భవాని అంటుంది. "ఈశ్వర్.. కృష్ణ వచ్చేదాకా మీ ఆవిడని ఇక్కడే ఉండమను.. తన మాటే వింటుంది నందు" అని భవాని చెప్తుంది. "మేమందరం ఇక్కడే ఉంటాం" అని ఈశ్వర్ అంటాడు.
మరోవైపు కృష్ణ తన నాన్న దశ దినకర్మ చేయడానికి వెళ్తుంది.
"తలకొరివి పెట్టినవాళ్ళే పిండాలు వదలాలి.. వాళ్లే దినకర్మ చేయాలి" అని శాస్త్రి గారు చెప్తారు కృష్ణకి. ఆ తర్వాత మురారి కార్ లో నుండి దిగుతాడు. "హమ్మయ్య.. ఆ లోటు లేకుండా మీ వారు వచ్చారు కదమ్మా" అని శాస్త్రి అంటాడు. "నా చేతుల మీదనే కానివ్వండి" అని మురారి అంటాడు. "ప్రాణం తీసిన మనిషే పిండప్రధానం చేయడం చాలా విచిత్రంగా ఉంది ఏసిపి సర్" అని మురారితో అంటుంది కృష్ణ. "మీరు లేని లోటు తెలియకుండా కృష్ణని చూసుకుంటాను గురువు గారు" అని మొక్కుకొని పిండాలని గంగలో వదులుతాడు మురారి.
ఒకవైపు కృష్ణ వాళ్ళ అత్తయ్య, ఇంకా భవాని ఎదురుచూస్తూ ఉంటారు. "ఎందుకని ఈ అడవిపిల్ల మన ఇంటి కట్డుబాట్లు, నియామాలను గాల్లోకి వదిలేసి.. ఎవరికీ చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయింది" అని భవాని చెప్తూ కృష్ణ కోసం ఎదురు చూస్తుంటుంది. అప్పుడే గుమ్మం లోపలికి కృష్ణ వస్తుంటుంది. "ఆగక్కడ. అడుగు లోపల పడిందో.. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, విలువలకి పీట వేసే ఇంట్లోకి వచ్చినప్పుడు.. మేం అనుమతివ్వని చోటుకి, మాతో కారణం చెప్పలేని పనిమీద బయటకు వెళ్ళావా? ఈ గడపే ఒక లక్ష్మణరేఖ అని నీకు తెలియదా? " అని కోప్పడుతుంది భవాని. అలా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే కృష్ణ ముకుంద మురారి తర్వాతి భాగం చూడాల్సిందే..!
![]() |
![]() |