![]() |
![]() |

యాంకర్ రవి బుల్లితెర మీద కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియా బాగా డెవలప్ అయ్యాకా సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతీ విషయం కూడా ఫుల్ వైరల్ అవుతోంది. "కాదే వీడియో సోషల్ మీడియాకి అనర్హం" అన్నట్టుగా చిన్న ఫంక్షన్ ఐనా సరే అప్ లోడ్ చేసి వ్యూస్ పెంచుకుంటున్నారు. జనాల్లో ఒక క్రేజ్ సంపాదించుకుంటున్నారు.
రీసెంట్ గా యాంకర్ రవి తన వైఫ్ నిత్యా బర్త్ డేని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసాడు. యాంకర్ రవి తన భార్య నిత్యా, కూతురు వియా అందరికీ పరిచయమే..బుల్లితెర మీద ఈవెంట్స్ కి, ఫంక్షన్స్ కి వీళ్ళను కూడా తీసుకొచ్చి పరిచయం చేస్తూ ఉంటాడు. దగ్గరి ఫ్రెండ్స్, రిలేటివ్స్ మధ్య పుట్టిన రోజు వేడుకను నిర్వహించాడు. తన వైఫ్ బర్త్ డే కోసం షాద్ నగర్ లో బ్యాక్ యార్డ్ గార్డెన్ లో ఉన్న ఫామ్ హౌస్ ని బుక్ చేసినట్లు చెప్పాడు..తాను టెంపుల్ కి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి ఈ ప్రోగ్రాం అంతా సెట్ చేసినట్లు చెప్పాడు. ఫైనల్ గా నిత్యాని ఫామ్ హౌస్ కి పిలిచి సర్ప్రైజ్ చేసాడు రవి. ఇంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేస్తారని తెలియని నిత్యా అక్కడి వాళ్ళను చూసి ఒక్కసారిగా షాకయ్యింది.
ఈ పార్టీలో రవి ఫ్యామిలీ ఫ్రెండ్స్, సన్నిహితులు బాగా ఎంజాయ్ చేశారు. కూతురు వియా డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. రవి కొన్నీళ్ళుగా బుల్లితెర మీద యాంకర్ గా చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. రవి ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ విషయాలను కూతురు వియాతో దిగిన ఫొటోస్ అన్నీ తన ఫాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.
![]() |
![]() |