Home  »  News  »  vignesh shivan: నయనతర భర్త విఘ్నేష్ శివన్ భావోద్వేగ పోస్ట్.. నా కలలన్నీ ముక్కలు  

Updated : Jun 1, 2026

 

విగ్నేష్ శివన్(vignesh shivan).. సౌత్ సినిమాలని ఫాలో అయ్యే సినీ ప్రేమికులకి పరిచయం అక్కర్లేని దర్శకుడు.. లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)హజ్బండ్ అనే టాగ్ లోనే ఉన్న విగ్నేష్ సుదీర్ఘ  కాలం నుంచి అనేక హిట్ సినిమాలని అందిస్తూ వస్తున్నాడు. గత నెల ఏప్రిల్ 10 న   ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి  జంటగా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'(ఎల్‌ఐకే' ) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

ఈ మూవీ గురించి రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా విగ్నేష్ శివన్ ఎక్స్ వేదికగా స్పందిస్తు  ఆన్‌లైన్‌లో కొందరు కావాలనే క్రియేట్ చేసిన విపరీతమైన నెగెటివిటీ వల్లే తాము థియేటర్లలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ని  మిస్ అయ్యామని చాలా మంది ప్రేక్షకులు నాకు  వ్యక్తిగతంగా మెసేజ్‌లు చేస్తున్నారు. కొన్ని సినిమాలు ఎలాంటి నెగెటివ్ రివ్యూలనైనా తట్టుకుని నిలబడే శక్తిని కలిగి ఉంటాయి. కానీ కొన్ని మంచి సినిమాలు ఆ ధాటికి తట్టుకోలేక వెనుకబడిపోతాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ప్రభావం చూపించే బ్యాక్‌గ్రౌండ్ లేదా గాడ్‌ఫాదర్స్ లాంటి వ్యక్తుల మద్దతు లేని సినిమాల విషయానికి వస్తే, ఇలాంటి ఉద్దేశపూర్వకమైన ప్రజాభిప్రాయాలు ఆ చిత్రాల తలరాతని  పూర్తిగా మార్చేస్తాయి. సినిమాని ఆరోగ్యకరంగా విమర్శించడమే కాకుండా, వ్యక్తిగత కక్షలతో లేదా కావాలనే రాసే నెగెటివ్ రివ్యూలు సాధారణ ప్రేక్షకులని  తీవ్ర గందరగోళానికి గురిచేస్తాయి.

మంచి పాజిటివ్ టాక్‌తో సూపర్ ఓపెనింగ్ వీకెండ్‌ని సొంతం చేసుకున్న తర్వాత, ఇంత త్వరగా కథ రివర్స్ అయిపోయి కలెక్షన్లు పడిపోవడాన్ని నేను అసలు ఊహించలేదు. 'ఎల్‌ఐకే' బాక్సాఫీస్ ఫలితాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ బాధాకరమైన ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నాను. ఈ కథని ఎంతో ఇష్టపడి, ఎంతో కష్టపడి వెండితెరపై ఆవిష్కరించాను. సినిమాని నిర్మించడం ఒక ఎత్తయితే, దానిని అన్ని అడ్డంకులు దాటుకుని థియేటర్ల వరకు తీసుకురావడం పెద్ద సవాలుతో కూడుకున్న విషయం. ఇంకా మెరుగైన ప్రేక్షకాదరణ  దక్కాల్సి ఉందని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నట్లు భావోద్వేగ ట్వీట్ చేసాడు.

చిత్ర పరిశ్రమలో ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక ఎంతో మంది రాత్రింబవళ్లు పడే కష్టం, పోరాటం దాగి ఉంటాయి. కానీ, కొన్నిసార్లు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకుండా ఆన్‌లైన్ ప్రపంచంలో జరిగే నెగెటివ్ ప్రచారం చిత్ర యూనిట్ కలలని  ముక్కలు చేస్తుంది. సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ తీవ్రమైన మానసిక ఆవేదనను అనుభవిస్తున్నారు ప్రముఖ సౌత్ ఇండియన్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. విభిన్న కాలానికి, మనుషులకి సంబంధించిన కధాంశాలతో  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కగా నయనతారకి చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థతో పాటు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.