Home  »  News  »  ఆ సమయంలో స్టార్ హీరోయిన్ నా మీద అరిచింది.. వనిత విజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Updated : Jun 9, 2026

 


తెలుగు సినిమా ఉన్నంత కాలం కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఏంఎస్ రాజు నిర్మించిన 'దేవి' సినిమా బతికే ఉంటుంది. సదరు మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా సుశీల క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసిన  వనితా విజయ్ కుమార్ కూడా ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచి ఉంటుంది. సీనియర్ లెజండ్రీ యాక్టర్ విజయ్ కుమార్, లెజండ్రీ హీరోయిన్ మంజుల కూతురే వనితా. కాకపోతే గత కొంత కాలంగా నటిగా కంటే వివాదాలతోనే  వార్తల్లో నిలుస్తు ఫైర్‌బ్రాండ్ గా మారింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సీనియర్ స్టార్ హీరోయిన్స్  నయనతార, రమ్యకృష్ణలతో తనకున్న వివాదాలపై ఎవరూ ఊహించని సంచలన నిజాలని  వెల్లడించారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణతో గతంలో ఒక రియాలిటీ షో వేదికగా జరిగిన గొడవ గురించి వనిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఆ రోజు సెట్స్‌లో ఏం జరిగిందో చెబుతూ వనిత ఆవేదన వ్యక్తం చేశారు.

రమ్యకృష్ణతో జరిగిన సంఘటనపై వనిత స్పందిస్తూ, అది వ్యక్తిగత విరోధం కాదు.కేవలం వృత్తిపరమైన ఇగో సమస్య మాత్రమే. ఒక ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన షోలో పాల్గొన్నప్పుడు, సదరు ఛానెల్ నాకు ఇచ్చిన ప్రామిస్ ఒకటి అయితే, అక్కడ ప్రాక్టికల్‌గా జరిగింది మరొకటి. నేను కేవలం ఒక సాధారణ బిగ్ బాస్ కంటెస్టెంట్‌ని మాత్రమే. ఒక ఫిల్మ్ స్టార్‌గా, సుదీర్ఘ సినీ నేపథ్యం ఉన్న విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తెగా ఇండస్ట్రీలోకి వచ్చాను. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ నటిగా కొనసాగుతున్ననన్ను వేరే వాళ్లతో పోల్చి జడ్జ్ చేసిన విధానం అస్సలు నచ్చలేదు.ఆ రోజు షోలో రమ్యకృష్ణ నా మీద అరవడం కరెక్ట్ కాదు. విభిన్న వయసుల వ్యక్తుల ప్రదర్శనలని ఒకేలా పోల్చడం తప్పు. 40 ఏళ్ల వయసులో ఉన్న నేను ,16 ఏళ్ల టీనేజ్ అమ్మాయి చేసే డాన్స్ లేదా పెర్ ఫార్మెన్సు ని చేయలేను. అలాగే 60 ఏళ్ల వయసున్న వారు నా లాంటి ప్రదర్శన ఇవ్వలేరు . ఆ రోజు రమ్యకృష్ణ స్పందించిన తీరు నచ్చకపోవడం వల్లే ఆ ప్రతిష్టాత్మక షో నుండి మధ్యలోనే బయటకి  వచ్చాను. దీనికి ఛానెల్ యాజమాన్యం ప్రవర్తనే ప్రధాన కారణం. అయితే రమ్యకృష్ణపై నాకు  వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదు. చిన్నప్పటి నుండి ఆమె నాకు తెలుసు. ఒక గొప్ప నటిగా ఆమెని ఎప్పుడూ గౌరవిస్తానని వనిత చెప్పుకొచ్చింది.

Also read: Nithya menen: నిత్యామీనన్ కొత్త సినిమా..హీరో, హీరోయిన్స్ కి ఆదర్శంగా నిలిచినట్టే

ఇదే సమయంలో, లేడీ సూపర్ స్టార్ నయనతారతో తనకు తీవ్రమైన విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లని  వనిత గట్టిగా ఖండించారు. నయనతార ఒక గొప్ప అచీవర్, అత్యంత దృఢమైన, ధైర్యవంతురాలైన వ్యక్తి . గతంలో ప్రభుదేవాతో నయన్ రిలేషన్‌లో ఉన్నప్పుడు నేను  వ్యతిరేకంగా మాట్లాడినట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికీ నయనతార భర్త విఘ్నేష్ శివన్‌తో టచ్‌లోనే ఉన్నానని, నయన్‌కి  పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా హృదయపూర్వక అభినందనలు తెలియజేశానని గుర్తు చేశారు. 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.