Home  »  News  »  తెలుగువన్ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమా.. దర్శకుడుగా తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్!

Updated : May 19, 2026

గత 26 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నత స్థాయి ప్రమాణాలతో కొనసాగుతున్న సంస్థ తెలుగువన్. ఇండియాలోనే ప్రప్రథమంగా యూట్యూబ్‌కి లింక్ అయిన తొలి ఛానల్‌గా తెలుగువన్‌కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. వివిధ కేటగిరీల్లో అందరికీ ఉపయోగపడే ఛానల్స్ ద్వారా ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన తెలుగువన్ 2024లో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టింది. 

రైతుల సమస్యలు ప్రధానంగా తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ‘రాజధాని ఫైల్స్‌’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాకుండా అందర్నీ ఆలోచింపజేసింది. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అదే ఉత్సాహంతో ఇప్ప్పుడు తెలుగు వన్ ప్రొడక్షన్స్ సంస్థ తమ రెండో చిత్రాన్ని ప్రకటించింది.

తన బర్త్‌డే సందర్భంగా తాము నిర్మించబోయే రెండో చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా తొలిసారి దర్శకత్వ బాధ్యతలను కూడా చేపడుతున్నారు కంఠంనేని రవిశంకర్. పంచభూతాలను ప్రధాన కథా వస్తువుగా తీసుకొని సినిమాకి అనుగుణంగా దాన్ని విస్తరించి ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 

తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు మే 19. తెలుగువ‌న్ స్టాఫ్‌తోపాటు ప‌లువురు అతిథులు ఆయ‌న పుట్టినరోజు వేడుక‌లో పాల్గొన్నారు. తెలుగువ‌న్ డైరెక్ట‌ర్ ర‌మేష్ ఈ వేడుక‌లో పాల్గొని కంఠంనేని ర‌విశంక‌ర్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపి, తెలుగువ‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌లో నిర్మాణం జ‌రుపుకోనున్న రెండవ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు. 

ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేయడమే కాకుండా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్న ప్రముఖ రచయిత జనార్థన మహర్షి ఈ సినిమాకి ర‌చ‌న చేస్తున్నారు. 2027 సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా ఇప్పటి నుంచే ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని దర్శకనిర్మాత కంఠంనేని రవిశంకర్ తెలియజేశారు.

తెలుగువ‌న్ ప్రొడ‌క్ష‌న్స్‌లో ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మాణం జ‌రుపుకోనుకున్న ఈ చిత్రాన్ని కె.హిమ‌బిందు స‌మ‌ర్పిస్తున్నారు. స‌హ‌నిర్మాత‌గా వై.జ‌తిన్‌కుమార్ వ్య‌వ‌హ‌రిస్తారు. జ‌నార్థ‌న మ‌హ‌ర్షి ర‌చ‌న‌లో నిర్మాణం జ‌రుపుకోనున్న ఈ చిత్రం కాన్సెప్ట్‌, ద‌ర్శ‌కుడు నిర్మాత: ర‌విశంక‌ర్ కంఠంనేని.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.