Home  »  News  »  విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. అసలు నిజం ఇదే! 

Updated : Aug 3, 2026

 

జయంరవి ఆయన సతీమణి ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ దాంపత్య బంధం తర్వాత 2024 సెప్టెంబర్‌లో రవి మోహన్ విడాకులు తీసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో నడుస్తుండగా, నిందలు, ఆరోపణలతో రచ్చకెక్కిన ఈ వివాదంపై ఆర్తి తల్లి, ప్రముఖ సినీ నిర్మాత సుజాత విజయకుమార్ చెన్నైలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యంగా విడాకుల భరణం కింద ఆర్తి నెలకి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందంటూ ప్రచారంలో ఉన్న వార్తలపై సుజాత విజయకుమార్ స్పష్టతనిచ్చారు. ఆ 40 లక్షల రూపాయల మొత్తం ఆర్తి వ్యక్తిగత విలాసాల కోసం అడిగింది కాదని, కుటుంబానికి ఉన్న అప్పులు, బ్యాంక్ జప్తు నోటీసులు, పిల్లల చదువు, రోజువారీ పోషణ వ్యయాల కోసమే. వారిద్దరి కుమారులు ఆరవ్, అయాన్‌లను రవి మోహన్ స్వయంగా చెన్నైలోని టాప్ అమెరికన్ స్కూల్‌లో  చేర్పించాం. వారిద్దరి స్కూల్ ఫీజు మాత్రమే ఏటా 86 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ పిటిషన్‌ను విచారించిన చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఆర్తి కోరిన 40 లక్షల భరణం దరఖాస్తును పునఃసమీక్షించి, విడాకుల ప్రక్రియ ముగిసేవరకు మధ్యంతర ఉపశమనంగా ఆర్తికి నెలకు 3 లక్షలు, ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు 1 లక్ష చొప్పున చెల్లించాలని తీర్పునిచ్చింది. దీనితో పాటు ఏటా అయ్యే 86 లక్షల స్కూల్ ఫీజులను, పిల్లల ఇతర ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఖర్చులను రవి మోహనే భరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు పిల్లలను తండ్రికి కలవనివ్వడం లేదని రవి మోహన్ చేసిన ఆరోపణలను అత్త సుజాత పూర్తిగా తోసిపుచ్చారు. రవి తమ పిల్లలను కలుసుకోవడానికి తామెప్పుడూ అడ్డంకులు సృష్టించలేదని, కోర్టు కూడా నెలకోసారి రవి మోహన్, ఆర్తి దంపతులు తమ కుమారులు ఆరవ్, అయాన్‌లతో కలిసి మాట్లాడాలని సూచించిందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు, మానసిక ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మంచి తీర్పును వెలువరించిన న్యాయమూర్తికి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇక గతంలో రవి మోహన్ హీరోగా 'అడంగమరు', 'భూమి', 'సైరన్' వంటి భారీ చిత్రాలను నిర్మించినప్పుడు సుమారు 1,100 కోట్ల రూపాయల వరకు బడ్జెట్, రుణ లావాదేవీలను నిర్వహించాల్సి వచ్చిందని, అందులో ప్రతీ సినిమా బడ్జెట్‌లో 25 శాతం మొత్తాన్ని రవి పారితోషికం, పన్నుల కోసమే కేటాయించామని చెప్పారు. తమ వద్ద పారితోషికాలు, బ్యాంక్ చెక్కులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు.


Also read: పెళ్లి నగలు ఇవ్వడంలేదని నటి.. ఆమెకి ఇంకొకరితో ఎఫైర్ ఉందని భర్త

సుజాత విజయకుమార్ వ్యాఖ్యల అనంతరం నటుడు రవి మోహన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక సంచలన పోస్ట్ చేసారు. శుభాకాంక్షలు తెలుపుతూ "కొందరు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించేలా ప్రవర్తించడం దురదృష్టకరం. నా జీవితం ఉన్నంతవరకు మేము నలుగురం మళ్లీ ఒకే గదిలో కూర్చోవడం జరగదు. అంతేకాకుండా తన తండ్రి మోహన్, తల్లి వరలక్ష్మి, సోదరుడు మోహన్ రాజాలతో దిగిన ఫోటో షేర్ చేస్తూ, తన తొలి దర్శకత్వ చిత్రం 'అన్ ఆర్డినరీ మ్యాన్' అప్‌డేట్‌ను కూడా షేర్ చేశారు. 15 ఏళ్ల దాంపత్య ముగింపు, కోర్టు విధించిన లక్షల భరణం, ఆరోపణల పరంపరతో ఈ విడాకుల వ్యవహారం తమిళ, తెలుగు ఇండస్ట్రీల్లో తీవ్ర ఆసక్తికరంగా మారింది.  తన కుమార్తె ఆర్తిని, మనవళ్లను కాపాడుకోవడానికే తాను బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చిందని ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

 


 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.