Home  »  News  »  Pawan kalyan: నా పేరు పవన్ కళ్యాణే కాదు.. అసలు విషయం చెప్పి షాక్ ఇచ్చేసాడు

Updated : Jun 10, 2026

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan)ఈపేరు వినపడినా, కనపడినా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఎంతగా పులకరించిపోతారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ అనే పేరుకి అంతటి శక్తీ ఉంది. ఒక పాడ్ క్యాస్ట్ లో పాల్గొన్న పవన్ తన పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పుకొచ్చాడు. సదరు పాడ్ క్యాస్ట్ ఓల్డ్ దే అయినా ఇప్పుడు  సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అవుతున్నాయి.

పవన్ మాట్లాడుతు తిరుమల దేవస్థానంలోని శ్రీ యోగ నరసింహ స్వామి ఆలయంలో నాకు నామకరణం జరిగింది. ఆ పవిత్ర స్థలంలోనాకు పెట్టిన  అసలు పేరు 'శ్రీ కళ్యాణ్ కుమార్". అయితే, కాలక్రమేణా స్కూల్ రికార్డుల్లో నమోదు చేసే సమయంలో 'శ్రీ'  అనే పదాన్ని తొలగించారు. దాంతో  కొణిదెల కళ్యాణ్ కుమార్ గా మారిపోయింది. చాలా మంది అసలు పేరు కళ్యాణ్ బాబు అని భావిస్తారు. కానీ శ్రీ కళ్యాణ్ కుమార్ నా పేరు.


Also read: Balakrishna: ఇదే ఫస్ట్ టైం అనుకుంటా.. అదరగొడుతున్న NBK 111  గ్లింప్స్‌

మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే టైంలో నువ్వు సాక్షాత్తు ఆ వాయుపుత్రుడైన హనుమంతుడిలా ఉన్నావు.. పవన్ పుత్ర హనుమాన్ లాంటి శక్తి నీది" అని చెప్పి నా పేరుకు ముందు ‘పవన్’ అనే పదాన్ని చేర్చారని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏ మాటలు, వీడియో వైరల్ గా మారాయి.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.