Home  »  News  »  Anna KOnidela: 15 ఏళ్ళ కన్‌ఫ్యూజ్‌కి తెరదించిన అన్నా కొణిదెల.. ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో

Updated : Apr 16, 2026

 

-ఒకే ఒక్క పోస్ట్ అన్ని డౌట్స్ పరార్ 
-అన్నా కొణిదెల సంచలనం 
-ఇన్నాళ్లు మీరేమనుకున్నారు 
-మరి లేటు చేయకుండా అసలు మాటర్ చూద్దాం

ప్రపంచం ఏ విషయాన్నయితే దశాబ్దంన్నర నుంచి నిజమని అనుకుంటుందో, అది నిజం కాదు వాస్తవం వేరే ఉంది అని తెలిస్తే.. పైగా ఆ నిజం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆయన భార్య అన్నా లెజినోవా(Anna lezhneva)కి సంబంధించిన న్యూస్ అయితే.. ఈ దశాబ్దంలోనే యావత్తు ప్రపంచం నోరెళ్లబెట్టిన వార్తగా నిలిచిపోతుంది. మరి ఈ దశాబ్దపు ఆ అత్యంత ఖరీదైన న్యూస్ ఏంటో చూద్దాం.

చాలా ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ అండ్ తీన్ మార్ లో చేసిన ఫారెన్ నటి పిక్స్ సోషల్ మీడియాలో ఉన్న విషయం తెలిసిందే. ఉండటమే కాదు ఆమెనే పవన్ వైఫ్ అన్నా లెజినోవా. ఆ ఇద్దరు తీన్ మార్ లో కలిసి నటించే సమయంలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని అందరు భావిస్తూ వచ్చారు. కానీ అలా అనుకున్న వాళ్లందరికి అన్నాలెజినోవా షాక్ ఇచ్చింది. రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తీన్ మార్ కి సంబంధించిన పిక్ ని షేర్ చేస్తు ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల పేరుతో కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌లో వేరే ఫోటోలు వస్తున్నాయి. ఈ తప్పుని మొదటిసారి ఎవరు చేశారో నాకు తెలియదు. ఆ ఫోటోలో ఉన్న అందమైన మహిళ మాత్రం నేను కాదు. ఆ మహిళ పేరు డానా మార్క్స్ . నా జీవితంలో నేను ఎప్పుడూ ఒక మోడల్‌గా కానీ, నటిగా కానీ కనిపించలేదంటు చాలా క్లారిటీగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క పోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులని, పవన్ ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తుంది. 


Also read: Samyuktha Menon: సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్.. మంచిర్యాలలో ఏం జరిగింది 

అన్నా లెజినోవా, పవన్ కూడా 'తీన్ మార్'(Teenmaar)సమయంలోనే మొదటిసారి కలుసుకున్నారు. తీన్ మార్ లో ప్రొడక్షన్ విభాగంలో వర్క్ చేసింది. క్రమంగా ఆ ఇద్దరి మధ్య పరిచయం జరగడం, ఆ పరిచయం ప్రేమగా మారడంతో సెప్టెంబర్ 30,2013న హైదరాబాద్‌లోని రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ ఇద్దరి పరిచయం,ప్రేమ గురించి అన్నా లెజినోవా చెప్తే ఫుల్ క్లారిటీ వస్తుంది కదా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి అన్నా లెజినోవా స్పందిస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా అన్నా లెజినోవా చెప్పిన న్యూస్ తో ఇన్నాళ్లు అపార్ధం చేసుకున్న వాళ్లంతా ఏది ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో అని ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే పరిస్థితి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.